కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్-నాగార్జున హీరోలుగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటివరకూ డీఎస్ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకోగా రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ప్రకటించిన సంగతి కూడా విదితమే. కుబేర అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. టైటిల్ తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాడు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి తాజాగా అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను బ్యాంకాక్ లో స్టార్ట్ చేసినట్టు తెలిపారు. ఈ ఎగ్జైటింగ్ పోర్షన్స్ ఖచ్చితంగా థియేటర్లలో మంచి ఎక్స్ పీరియన్స్ ను ఇస్తాయని పోస్ట్ లో పేర్కొన్నారు.
#Kubera‘s new schedule kicks off in Bangkok with renewed energy! 🤟🏻
Exciting talkie portions will be shot promising a blast of an experience at the cinemas soon ❤️🔥@dhanushkraja @iamnagarjuna @iamRashmika @sekharkammula @jimSarbh @Daliptahil @ThisIsDSP @AsianSuniel pic.twitter.com/DxxjwYrdUA
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) March 13, 2024
కాగా ఈసినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ తో పాటు పలు భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: