కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 152

prabhas salaar part 2 shooting update
షూటింగ్ అప్‌డేట్

సలార్- వరదరాజ మన్నార్ పై స్పెషల్ యాక్షన్ ఎపిసోడ్

సలార్ తో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఖాన్సార్ అనే సామ్రాజ్యపు కుర్చీ కోసం జరిగే పోరు నేపథ్యంలో ఈసినిమా కథ. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ తో ఈసినిమా వచ్చింది. ఈసినిమాకు ప్రభాస్ కటౌటే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

TFN Adminవాట్సాప్
Kalyani Vaccha Vacchaa song from out from Family Star movie
సాంగ్

ఫ్యామిలీ స్టార్ నుండి కల్యాణి వచ్చా వచ్చా సాంగ్ ప్రోమో రిలీజ్

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పరుశురాం, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలపెట్టేసింది. రీసెంట్ గానే టీజర్ ను కూడా రిలీజ్ చేయగా టీజర్ అందరినీ ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
Gaami Producer Karthik Sabareesh Reveals Interesting Facts About Vishwak Sen's Movie
సినిమా వార్తలు

గామిలో సింహం సీక్వెన్స్ అలా తీశాం - నిర్మాత కార్తీక్ శబరీష్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. కాగా ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేయడం విశేషం. వి సెల్యులాయిడ్ సమర్పణలో మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి, విమర్శకుల ప్రశంసలని అందులోని ఘన విజయాన్ని సాధించింది. ‘గామి’ ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్స్‌తో అన్ని చోట్లా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న నేపధ్యంలో నిర్మాత కార్తీక్ శబరీష్ విలేకరుల సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలని పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
prasanth varma update on hanuman ott release date
ఓటీటీ

హనుమాన్ ఓటీటీ రిలీజ్ పై ప్రశాంత్ వర్మ అప్ డేట్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది.సంక్రాంతికి ఈసినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. ఎన్నో పెద్ద సినిమాలు పోటీలో ఉన్నా కానీ ఎంతో నమ్మకంతో రిలీజ్ అయింది. మేకర్స్ నమ్మకాన్ని నిజంచేస్తూ ఆడియన్స్ కూాడా ఈసినిమాకు బ్రహ్మరధం పట్టారు. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ప్రశాంత్ మేకింగ్, తేజ నటన, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి బ్లాక్ బస్టర్ ను అందించాయి.ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా రికార్డుల మోత మోగించింది.

TFN Adminవాట్సాప్
Ashwin Babu New movie title revealed
సినిమా వార్తలు

అశ్విన్ బాబు కొత్త సినిమా టైటిల్ రిలీజ్

నటుడు అశ్విన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. తనకొచ్చిన అవకాశాలను ఏమాత్రం వదులుకోకుండా సినిమాలు చేసుకుంటున్నాడు. గత ఏడాది హిడింబ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Gaami is going to break even this week
సినిమా వార్తలు

బ్రేక్ ఈవెన్ దిశగా గామి

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన గామి బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తూ బ్రేక్ఈవెన్ దిశగా సాగుతుంది.మూడు రోజుల్లో ఈసినిమా 20కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది నిర్మాతలు ప్రకటించారు. ఇందులో షేర్ 9కోట్లు.కేవలం 11కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగడంతో మరో రెండు కోట్లు రాబడితే చాలు బ్రేక్ ఈవెన్ అయినట్లే.ఈవారంలో ఆమార్క్ ను చేరుకోనుంది.

Mahender Reddyవాట్సాప్
Allari Naresh Aa Okkati Adakku Teaser Release Date Fixed
ట్రైలర్ & టీజర్

ఆ ఒక్కటీ అడక్కు.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫుల్ కామెడీ డ్రామాగా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో 'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తుండగా.. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
salaar 2 shooting update
షూటింగ్ అప్‌డేట్

సలార్ 2 షూటింగ్ ఎప్పుడో చెప్పిన ప్రుథ్వీరాజ్

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మొదటి భాగం సీజ్ ఫైర్ గత ఏడాది చివర్లో విడుదలై బ్లాక్ బాస్టర్ అయిన సంగతి తెలిసిందే.ఈసినిమా 600కోట్ల వరకు రాబట్టింది.దీనికి సీక్వెల్ కూడా రానున్నడడంతో సలార్ 2 పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.శౌర్యంగపర్వం పేరుతో తెరకెక్కనుంది.ఇక ఈసినిమా షూటింగ్ ఏప్రిల్ లో స్టార్ట్ కానుందని ఫస్ట్ పార్ట్ లో నటించిన బాబీ సింహ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు. తాజాగా మరోసారి షూటింగ్ గురించి అప్డేట్ వచ్చింది.ఫస్ట్ పార్ట్ లో కీలక పాత్రలో కనిపించిన మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అతి త్వరలో సలార్ 2 షూటింగ్ స్టార్ట్ కానుందని ఓ సినిమా ప్రమోషన్ లో తెలిపాడు.దాంతో ఏప్రిల్ లో షూటింగ్…

Mahender Reddyవాట్సాప్
Vishwak Sen's Gaami Collects 20.3 Cr Gross Worldwide in 3 Days
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్న గామి.. 3 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'గామి'. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ మూవీలో చాందిని చౌదరి కథానాయికగా నటించింది. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ వినిపించింది. ట్రైలర్ తర్వాత మంచి బజ్ ఏర్పడటంతో భారీ ఓపెనింగ్ సాధించింది. డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన ఈ మూవీకి ఆడియెన్స్ మౌత్ టాక్ స్ప్రెడ్ బాగా కలిసొచ్చింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌రియన్స్ ఇస్తోందని ఇలా ఈ చిత్రంపై చాలా ప్రశంసలు వస్తున్నాయి.

Srikanth Mవాట్సాప్
Family Star second single out on 12th March
సినిమా వార్తలు

ఫ్యామిలీ స్టార్ సెకండ్ సింగిల్ వస్తుంది

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ షూటింగ్ తుది దశకు చేరుకుంది.ప్రస్తుతం హైదరాబాద్ లో ఫైనల్ షూటింగ్ జరుగుతుంది.రీసెంట్ గా ఈసినిమానుండి టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.ఇక ఇంతకుముందు ఈసినిమా నుండి మొదటి సాంగ్ నందనందనా రిలీజ్ చేయగా దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక ఇప్పుడు సెకండ్ సాంగ్ కూడా విడుదలకానుంది.

Mahender Reddyవాట్సాప్
Director Surya Kiran Passed Away
సినిమా వార్తలు

చిత్ర పరిశ్రమలో విషాదం.. డైరెక్టర్ సూర్యకిరణ్ కన్నుమూత

చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. 'సత్యం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సూర్యకిరణ్‌ కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సూర్యకిరణ్‌ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సూర్యకిరణ్‌ అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి.

Srikanth Mవాట్సాప్
ritu varma poster released from swag movie
ఫస్ట్ లుక్

స్వాగ్ లో మహారాణి రుక్మిణిదేవి గా రీతూవర్మ

హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో రాజరాజచోర సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి హిట్ నే అందించింది. ఇక ఈసినిమా టైటిల్ ను రీసెంట్ గానే ప్రకటించారు. స్వాగ్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
allu arjun pushpa 2 movie new schedule at vizag
షూటింగ్ అప్‌డేట్

పుష్ప2- వైజాగ్ లో పుష్పరాజ్ కు గ్రాండ్ వెల్ కమ్

సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప2 సినిమా కూాడా ఒకటి. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో బన్నీ మాస్ లుక్, తన నటన తో పాట కథ, పాటలు అన్నీ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. ఇక ఈసినిమా ఇక్కడ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనాలు సృష్టించడంతో నార్త్ లో కూడా అల్లు అర్జున్ ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అందుకే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ ఈసినిమాకోసం ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Sai Dharam Tej Launches Own Production House Vijaya Durga Productions
సినిమా వార్తలు

ఓన్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన సాయి ధరమ్ తేజ్

టాలీవుడ్ సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. తెరపైనే కాదు వెనుక కూడా కీలక పాత్ర పోషించడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన నిర్మాతగా మారారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ సొంతంగా ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించారు. విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సాయి తేజ్.. ఓన్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈ ప్రొడక్షన్ హౌస్‌కు 'విజయ దుర్గ ప్రొడక్షన్స్' అని నామకరణం చేశారు.

Srikanth Mవాట్సాప్
akash puri interesting comments on double ismart movie teaser
ట్రైలర్ & టీజర్

డబుల్ ఇస్మార్ట్ టీజర్ పై ఆకాష్ పూరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా ఎంత ఘన విజయం సాధించిందో చూశాం. పూరీ డైలాగ్స్ కు రామ్ నటన తోడవ్వడం దానికిి తోడు మ్యూజిక్ కూడా కలిసిరావడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు చిత్రబృందం.

TFN Adminవాట్సాప్
Naga Chaitanya Celebrated His Personal Assistant Venky's Birthday on Thandel Sets
సినిమా వార్తలు

అసిస్టెంట్‌ బర్త్ డే సెలబ్రేట్ చేసిన నాగచైతన్య

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‍గా నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఫై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులో నాగచైతన్య తొలిసారి మత్స్యకారుడిగా ఒక వైవిధ్యభరితమైన పాత్రలో కనిపిస్తున్నారు. మొదటిసారి ఇలాంటి క్యారక్టర్‌లో కనిపించనుండటంతో చైతన్య కూడా దీనిని ఛాలెంజ్‌గా తీసుకుని నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
dhanush and nagarjuna movie title and first look released
ఫస్ట్ లుక్

ధనుష్-నాగార్జున మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

మల్టీ స్టారర్ సినిమాలు కామన్ అయిపోయాయి. పెద్ద పెద్ద హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషనే మరొకటి తెరపైకి వస్తుంది. ధనుష్-నాగార్జున హీరోలుగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. జనవరిలో ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లగా ప్రస్తుతం అయితే షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
nbk 109 movie powerful glimpse out now
ట్రైలర్ & టీజర్

NBK109 పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ.. రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా మూడు హిట్లతో బ్లాక్ బస్టర్ హిట్ల ను అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
premalu movie telugu review
రివ్యూ

ప్రేమలు మూవీ తెలుగు రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా క్లీన్ ఎంటర్ టైనర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూత్ తో పాటు అందరికీ నచ్చుతుందని చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్
Ooru Peru Bhairavakona Now Streaming on Amazon Prime Video
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన 'ఊరు పేరు భైరవకోన'

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్‌ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. కావ్య థాపర్ మరియు వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. సోషియో ఫాంటసీగా రూపొందిన ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా నిర్మించగా.. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు. ఫిబ్రవరి 16న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చింది. ఆసక్తి కలిగించే కథాంశంతో మంచి మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది.

TFN Adminవాట్సాప్

షేర్