మహేష్ బాబు ప్రేమలు రివ్యూ పై కార్తికేయ సూపర్ రిప్లై

SS Karthikeya Responds Over Mahesh Babu's Review on Premalu Movie

మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘ప్రేమలు’ మూవీ తెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తనయుడు, ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయ దీనిని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. తెలుగులోనూ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ మూవీని చూసి స్పందిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ చిత్రంపై రివ్యూ ఇచ్చారు. ఒక సినిమా చూస్తూ, చివరిసారి ఇంతలా ఎప్పుడు నవ్వానో కూడా గుర్తులేదని, అంతగా ఈ చిత్రం తనను ఆకట్టుకుందని ప్రశంసలు కురిపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మేరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “ప్రేమలు సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు ఎస్ఎస్ కార్తికేయకు ధన్యవాదాలు. ఈ సినిమాను పూర్తిగా ఆస్వాదించాను.. ఒక సినిమా చూస్తూ నేను ఇంతలా నవ్విన సందర్భం చివరిసారిగా ఎప్పుడు జరిగిందో గుర్తులేదు. ఈ మూవీ చూస్తూ నా ఫామిలీ అంతా చాలా ఎంజాయ్ చేసింది. యంగ్ స్టర్స్ అందరూ అద్భుతంగా నటించారు. ప్రేమలు టీమ్ మొత్తానికి అభినందనలు” అని పేర్కొన్నారు.

ఇక మహేష్ బాబు వ్యాఖ్యలపై నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ స్పందించారు. మహేష్ ట్వీట్‌కు బదులిస్తూ ఆయన ఇలా అన్నారు.. “సార్‌ర్‌ర్‌.. ఇది నాకు ఆశ్చర్యం కలిగించే విషయం.. మీ ట్వీట్‌ని చూసిన తర్వాత ఇక నా ఎక్సైట్‌మెంట్‌ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. మీ మాటలు నా హృదయాన్ని టచ్ చేసాయి. మీ ఫ్యామిలీ మొత్తం సినిమాను ఎంజాయ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రేమలు టీమ్ క్లౌడ్ నైన్‌లో ఉంది. థ్యాంక్యూ సో మచ్ సార్” అని కార్తికేయ రిప్లై ఇచ్చారు. కాగా ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + three =