యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర కొత్త షెడ్యూల్ ఈనెల 19నుండి గోవాలో ప్రారంభం కానుంది.ఈ షెడ్యూల్ లో విలన్ రోల్ లో నటిస్తున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా పాల్గొననున్నాడు.గాయం నుంచి కోలుకున్న సైఫ్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.దేవర షూటింగ్ లోనే సైఫ్ గాయపడిన విషయం తెలిసిందే దాంతో ఇన్ని రోజులు విశ్రాంతి తీసుకోగా ఇప్పుడు మళ్ళీ షూటింగ్ కు రెడీ అవుతున్నాడు.ఇక ఈసినిమా రెండు భాగాలుగా రానుంది అందులో భాగంగా మొదటి భాగం అక్టోబర్ 10న విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి ఏప్రిల్ 5నే ఈసినిమా విడుదలకావాలి కానీ అనుకున్న ప్రకారం షూటింగ్ జరుగకపోవడంతో వెనక్కి వెళ్ళిపోయింది.కొరటాల శివ డైరెక్షన్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.ఎన్టీఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈసినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలకానుంది.ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























