టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంటారు. తన సినిమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు అందిస్తుంటారు. అలాగే నెటిజెన్లు, అభిమానులు కూడా ఆయనను రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా నెటిజెన్లు హరీష్ శంకర్‌కి సంబంధించిన ఒక వీడియోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో డైరెక్టర్ హరీష్ శంకర్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ అధినేత రవి శంకర్ ఇరువురూ కలిసి కారులో వెళ్తుండగా ఓ చోట రోడ్ మధ్యలో ఆగిపోయిన కారు ఒకటి కనిపించింది. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి నెలకొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇది గమనించిన వీరు వెంటనే కార్ దిగి వెళ్లి వాహనం నడుపుతున్న వ్యక్తికీ సాయం అందించారు. రోడ్డు మధ్యలో నిలిచిపోయిన ఆ వాహనాన్ని ముందుకు తోస్తూ రోడ్డు పక్కన పార్కింగ్ చేయడంలో సాయపడ్డారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ డైరెక్టర్ చేసిన పనిని ప్రశంసిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. అంత పెద్ద డైరెక్టర్, నిర్మాత అయి ఉండి ఇలా రోడ్ మధ్యలో వేరే వాళ్ళ కార్ ఆగిపోతే తోస్తూ సాయం అందించడం నిజంగా సూపర్ అని వారు అభినందిస్తున్నారు.
#TFNReels: A kind gesture shown by Director @harish2you and @MythriOfficial Producer #RaviShankar as they helped push a car that stopped in the middle of the road!👏👏#HarishShankar #UstaadBhagatSingh #TeluguFilmNagar pic.twitter.com/l1Z0ntX3LT
— Telugu FilmNagar (@telugufilmnagar) March 14, 2024
ఇక ఇదిలా ఉంటే.. హరీష్ శంకర్ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో రవితేజ పూర్తి భిన్నమైన లుక్‌తో కనిపించనున్నారని, ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా అవుతుందని హరీష్ శంకర్ ఇప్పటికే తెలిపారు. వీరి కాంబోలో ఇంతకుముందు వచ్చిన ‘మిరపకాయ్’ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో ‘మిస్టర్ బచ్చన్’ చిత్రపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: