‘ఊరు పేరు భైరవకోన’ సినిమా బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్న హీరో సందీప్ కిషన్.. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు లైన్‌లో పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా తన తదుపరి ప్రాజెక్టు గురించి కీలక ప్రకటన చేశారు. దీనిలో భాగంగా మంగళవారం తన ల్యాండ్‌మార్క్ 30వ సినిమాని అనౌన్స్ చేశారు. ‘ధమాకా’ వంటి భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని #SK30 అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Thank You Dear Audience for the Love,Strength & #OoruPeruBhairavakona ♥️
Pleased to Announce my 30th film
a “Mad Family Entertainer” with my Favourites in the Genre #NakkinaTrinadhRao & #PrassanaBezawada♥️& At Home with my Dearest @AnilSunkara1 sir & @RajeshDanda_ ♥️#SK30 pic.twitter.com/4g5OwyERwW
— Sundeep Kishan (@sundeepkishan) March 12, 2024
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నారు. కాగా ఇంతకుముందు ‘సామజవరగమన’, ‘ఊరు పేరు భైరవకోన’ వంటి వరుస హిట్‌ల తర్వాత, వారి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్‌లను పూర్తి చేయడానికి ప్రొడక్షన్ హౌస్‌లు ఈ సినిమా కోసం మళ్లీ జతకట్టాయి. అలాగే త్రినాధ రావు నక్కిన మరియు ప్రసన్న కుమార్ బెజవాడలది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వారిద్దరూ కలిసి ‘ధమాకా’తో సహా అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ కొత్త చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్‌లను అందిస్తునారు.
రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విభిన్నమైన స్క్రిప్ట్‌లతో అలరించే సందీప్ కిషన్ #SK30లో డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు, కాగా ఈ చిత్రం గ్రాండ్ ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందించబడుతోంది. ఈ సినిమాలో త్రినాథరావు నక్కిన, ప్రసన్నల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నికల్ టీం తదితర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: