మెగాస్టార్ చిరంజీవి- బింబిసార ఫేమ్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర.భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతుంది.రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ అవ్వగా పెద్దగా బ్రేక్ లేకుండా షెడ్యూల్ లను కంప్లీట్ చేస్తున్నారు.అందులో భాగంగా తాజాగా ఈసినిమాలో ఒక సాంగ్ ను చిత్రీకరించారు.ఈసాంగ్ కు నా సామి రంగ దర్శకుడు విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ చేశాడు.ఈ సందర్భంగా నా కల నెరవేరింది బ్యూటీఫుల్ సాంగ్ కోసం మెగాస్టర్ కు కొరియోగ్రఫీ చేశా అని తన ఆనందాన్ని ఇంస్టా గ్రామ్ ద్వారా పంచుకున్నాడు విజయ్ బిన్నీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా యువ హీరోయిన్లు ఇషా చావ్లా ,సురభి,చిరు చెల్లెళ్ళు నటిస్తున్నారు.ఆస్కార్ విజేత ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఇక చిరు,ఆచార్య తరువాత గత ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ తో కం బ్యాక్ ఇచ్చాడు అయితే ఆ తరువాత భోళా శంకర్ తో నిరాశపరిచాడు.మరి సంక్రాంతి సెంటిమెంట్ మరో సారి వర్క్ అవుట్ అయ్యి విశ్వంభరతో చిరు మరో బ్లాక్ బాస్టర్ ను ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: