
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 150


గేమ్ ఛేంజర్- వైజాగ్ లో చరణ్ కు గ్రాండ్ వెల్ కమ్

ఓం భీమ్ బుష్ ట్రైలర్ రిలీజ్

దేవి చేతిలో 7 సినిమాలు

కల్కి 2898 రిలీజ్ పై అమితాబ్ క్లారిటీ

తంగలాన్ వచ్చేది అప్పుడే

షూటింగ్ చివరి దశలో విజయ్ గోట్

విశాల్ 'రత్నం' ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఎప్పుడంటే?

జపాన్ లో ఇంకా తగ్గని ఆర్ఆర్ఆర్ క్రేజ్

మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిన్న సినిమా

తెలుగులో ప్రేమలు డామినేషన్

భైరవకోన లేటెస్ట్ కలెక్షన్స్

ఘనంగా జరిగిన కిరణ్ నిశ్చితార్థ వేడుక

పృథ్వీ రాజ్ సుకుమారన్ ఆడు జీవితం డబ్బింగ్ కంప్లీట్
మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నుండి రాబోతున్న సినిమా ఆడు జీవితం. బ్లెస్సీ దర్శకత్వంలో యధార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు మేకర్స్. 1990లో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ. మార్చి 28వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్, ట్రైలర్ లను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించి ఒక అప్…

గేమ్ ఛేంజర్- వైజాగ్ లో చరణ్ కు గ్రాండ్ వెల్ కమ్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లోకనిపించనున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమాషూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా.

ఓం భీమ్ బుష్ ట్రైలర్ రిలీజ్
హుషారు ఫైమ్ శ్రీహర్ష కనుగంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఓం భీమ్ బుష్. గుప్త నిధుల కోసం ముగ్గురు స్టూడెంట్స్ చేసిన అన్వేషణను ఈసినిమా ద్వారా చూపించనున్నట్టు శ్రీహర్ష ఇప్పటికే తెలిపారు. ఈసినిమా మార్చి 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

పుష్ప 2 ను ఓవర్సీస్ లో సొంతం గా రిలీజ్ చేస్తున్నారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుతుంటుంది.ఎలాగైనా రిలీజ్ డేట్ ను అందుకోవాలని బ్రేక్ లేకుండా షూటింగ్ ను కొనసాగిస్తున్నారు.ఇక ఈసినిమా థియేట్రికల్ రైట్స్ కు ఫుల్ డిమాండ్ వుంది.ఫస్ట్ పార్ట్ బ్లాక్ బాస్టర్ కావడంతో ఈ సీక్వెల్ ఫై భారీ అంచనాలు వున్నాయి దాంతో నిర్మాతలు రైట్స్ కు భారీ మొత్తం లో కోట్ చేస్తున్నారు.థియేట్రికల్ బిజినెస్సే 500కోట్ల వరకు జరుగొచ్చు అని అంచనా.

నేను మారతానని త్రివిక్రమ్ జల్సాలో ఆ డైలాగ్స్ రాశాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఎలక్షన్స్ టైమ్ దగ్గరపడుతుండటంతో సినిమాలను సైతం పక్కనపెట్టి ఎప్పటినుండో పవన్ పూర్తిగా తన ఫోకస్ ను రాజకీయాలపై పెట్టాడు. ఇప్పటికే తను పోటీ చేస్తున్న నియోజకవర్గం గురించి క్లారిటీ కూడా ఇచ్చాడు. తాజాగా పార్టీ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పవన్ పోటీ చేయనున్నట్టు తెలిపాడు. అంతేకాదు అదే సమయంలో తన పొలిటికల్ జర్నీ గురించి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా దగ్గర డబ్బులు లేక పార్టీని ఎలా నడపాలో అని భావిస్తున్న సమయంలో నా స్నేహితుడు త్రివిక్రమ్ వెన్నంటే ఉన్నారని.. నేను ప్రజల గురించి ఆలోచిస్తే త్రివిక్రమ్…

ప్రేమలు వచ్చేది ఈ ఓటిటి లోకే
రీసెంట్ మలయాళం బ్లాక్ బాస్టర్ ప్రేమలు అదే టైటిల్ తెలుగులోకి డబ్ అయ్యి ఇక్కడ కూడా అదరగొడుతుంది.స్ట్రెయిట్ తెలుగు సినిమాలను డామినేట్ చేస్తూ రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను కావడం తో ఫుల్ రన్ లో భారీ లాభాలను తీసుకురానుంది.ట్రెండ్ చూస్తే ఫుల్ రన్ లో ప్రేమలు 10కోట్ల వరకు రాబట్టుకోవచ్చు.ఎస్ ఎస్ కార్తికేయ ఈసినిమాను తెలుగులో విడుదలచేశాడు.అటు మలయాళంలో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 105కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

ఓటీటీలోకి వచ్చేసిన భ్రమయుగం
రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో మలయాళం సీనియర్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా భ్రమయుగం. హార్రర్ థిల్లర్ నేపథ్యంలో పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ గా ఈసినిమాను రూపొందించారు. మలయాళంలో రిలీజ్ అయిన ఈసినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. అక్కడ ఈసినిమా సూపర్ హిట్ అవ్వంతో తెలుగులో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో కూడా ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

హనుమాన్ సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యం పై ప్రశాంత్ వర్మ క్లారిటీ
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది.సంక్రాంతికి ఈసినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. ఎన్నో పెద్ద సినిమాలు పోటీలో ఉన్నా కానీ ఎంతో నమ్మకంతో రిలీజ్ అయింది. మేకర్స్ నమ్మకాన్ని నిజంచేస్తూ ఆడియన్స్ కూాడా ఈసినిమాకు బ్రహ్మరధం పట్టారు. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ప్రశాంత్ మేకింగ్, తేజ నటన, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి బ్లాక్ బస్టర్ ను అందించాయి.ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా రికార్డుల మోత మోగించింది.

దేవి చేతిలో 7 సినిమాలు
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇటీవల కొంచెం స్లో అయ్యాడు.ఏడాదికి అరడజనకు పైగా సినిమాలతో బిజీ గా వుండే ఈ మ్యూజిక్ డైరెక్టర్ గత 4 ,5 సంవత్సరాల నుండి సెలెక్టడ్ గా సినిమాలు ఎంచుకుంటున్నాడు.ఇక ఆడియో ఫంక్షన్ లలో దేవి చేసే హంగామా అంతా ఇంతా కాదు అయితే ఈమధ్య కాలంలో అదేం కనిపించడం లేదు అయితే ఎట్టకేలకు దేవి మళ్ళీ ఇప్పుడు జోరు పెంచాడు.

స్ట్రీమింగ్ కు వచ్చేసిన సేవ్ ద టైగర్స్ 2
ఇప్పుడు తెలుగులో కూడా వరుసగా వెబ్ సిరీస్ లు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక అలా వచ్చిన వెబ్ సిరీస్ లలో సూపర్ హిట్ అయిన వాటిలో సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ కూడా మొదటి వరుసలో ఉంటుంది. తేజా కాకుమాను దర్శకత్వంలో ప్రియదర్శి, చైతన్యకృష్ణ, అభినవ్ గోమటం, సుజాత, దేవయాని, పావని గంగిరెడ్డి కీలక పాత్రల్లో ఈ వెబ్ సిరీస్ వచ్చింది. భార్య భర్తల కథాంశంతో.. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసిరీస్ గత ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అవ్వగా మంచి ప్రేక్షకాదరణ పొందింది.

కల్కి 2898 రిలీజ్ పై అమితాబ్ క్లారిటీ
ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. మహాభారతంతో మొదలై 2898 ఏడీ సంవత్సరంలో ముగుస్తుంది ఈ కథ. ఇక ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. ఇక చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టనున్నారు. ఈనేపథ్యంలోనే శివరాత్రి సందర్బంగా ఈసినిమా నుండి ప్రభాస్ పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. భైరవ అనే పాత్రలో నటిస్తున్నాడు ప్రభాస్.

తంగలాన్ వచ్చేది అప్పుడే
విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఈ సినిమా వస్తుంది. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

షూటింగ్ చివరి దశలో విజయ్ గోట్
దళపతి విజయ్ మాత్రం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

విశాల్ 'రత్నం' ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఎప్పుడంటే?
తమిళ్ స్టార్ హీరో విశాల్ ఇటీవలే 'మార్క్ ఆంటోని'తో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి విశాల్ కెరీర్‌లో తొలి 100 కోట్ల క్లబ్ మూవీగా నిలిచింది. దీని తర్వాత ఆయన హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రత్నం'. మాస్ యాక్షన్ సినిమాలు తీయడంలో పేరొందిన సీనియర్ డైరెక్టర్ హరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫుల్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ మూవీపై అంచనాలను అమాంతం పెంచేసింది.

అజిత్ తో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా టైటిల్ రిలీజ్
ఇప్పుడు తెలుగు మేకర్స్ తమిళ్ హీరోలతో, తమిళ్ హీరోలు తెలుగు మేకర్స్ తో సినిమాలు చేయడం కామన్ అయిపోయింది. ఇప్పటికే చాలా కాంబినేషన్స్ వచ్చాయి.. కొన్ని కాంబినేషన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వబోతుంది. ఆ కాంబినేషన్ ఏదో కాదు. తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒక సినిమా రావడం. ఈసినిమాపై ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి కూడా విదితమే.

జపాన్ లో ఇంకా తగ్గని ఆర్ఆర్ఆర్ క్రేజ్
ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటాడు దర్శక ధీరుడు రాజమౌళి. చరిత్రలో అసలు కలవని ఇద్దరు స్వతంత్య్ర సమరయోధుల కథలను తీసుకొని ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఈసినిమా దేశవ్యాప్తంగా ఎంత ప్రభంజనం సృష్టించిందో.. ప్రపంచ వ్యాప్తంగా కూడా అంతే ప్రభంజనం సృష్టిస్తుంది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకొని ఫైనల్ గా అందరూ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అస్కార్ అవార్డును సైతం దక్కించుకొని చరిత్ర పుటల్లోకి ఎక్కింది.

మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిన్న సినిమా
ఫిబ్రవరి మలయాళ ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చింది.మిగితా మూవీ ఇండస్ట్రీలు సరైన సినిమాలు లేక వెల వెల పోగా మాలీవుడ్ మాత్రం అదరగొట్టింది.ఏకంగా మూడు సినిమాలు కలిపి 300కోట్లకు పైగా రాబట్టి సెన్సేషన్ సృష్టించాయి.ఇందులో రెండు సినిమాలు 100కోట్ల మార్క్ ను దాటాయి.అవే ప్రేమలు ,మంజిమ్మల్ బాయ్స్.ఈరెండు సినిమాల్లో ప్రేమలు ముందు విడుదలకాగా బ్లాక్ బాస్టర్ టాక్ తో 100కోట్ల మార్క్ ను దాటేసి ఆల్ టైం హైయెస్ట్ మాలీవుడ్ గ్రాసర్ జాబితాలో 5వస్థానంలో కొనసాగుతుంది.ఇక రెండోది మంజుమ్మెల్ బాయ్స్ గత నెల 21న విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.

తెలుగులో ప్రేమలు డామినేషన్
మలయాళ డబ్బింగ్ సినిమా ప్రేమలు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద డామినేషన్ కొనసాగిస్తోంది.గత వారం గామి,భీమాలతో పాటు విడుదలై ఇప్పుడు ఆ రెండింటికంటే ఎక్కువ వసూళ్లను రాబడుతూ స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తోంది.మౌత్ టాక్ ఎక్స్ట్రార్డినరీ గా ఉండడంతో రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.బుక్ మై షోలో మిగితా రెండు సినిమాలకంటే ఎక్కువ టికెట్లు ప్రేమలుకే తెగుతున్నాయి.

భైరవకోన లేటెస్ట్ కలెక్షన్స్
టైగర్ తరువాత యంగ్ హీరో సందీప్ కిషన్-డైరెక్టర్ వి ఐ ఆనంద్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఊరు పేరు భైరవకోన.గత నెలలో మంచి అంచనాల మధ్య విడుదలైన ఈచిత్రం ఆ అంచనాలను అందుకొని హిట్ అనిపించుకుంది.ఇక ఈసినిమా విడుదలై నిన్నటికి 25రోజులు పూర్తి చేసుకోవడంతో ఎంత కలెక్ట్ చేసిందో నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.నిన్నటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 30కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుందని పోస్టర్ ద్వారా ప్రకటించారు.ముఖ్యంగా సాంగ్స్,సినిమాకు చాలా హెల్ప్ అయ్యాయి.సినిమా విడుదలకు ముందే సాంగ్స్ చార్ట్ బాస్టర్ కావడంతో హైప్ పెరిగిపోయింది.

ఘనంగా జరిగిన కిరణ్ నిశ్చితార్థ వేడుక
ఒకప్పుడు టాలీవుడ్ లో బ్యాచ్ లర్ల సంఖ్య ఎక్కువ ఉండేది. అయితే ఇప్పుడు హీరోలు మాత్రం కెరీర్ ను పర్సనల్ లైఫ్ ను రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. అందుకే ఏ మాత్రం ఆలోచించకుండా యంగ్ హీరోలు పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టగా ఇప్పుడు మరో యంగ్ హీరో సైతం త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు కిరణ్ అబ్బవరం.