దేవిశ్రీ ప్రసాద్ స్టూడియోలో ఇళయరాజా, ఫొటోస్ వైరల్

Rockstar Devi Sri Prasad Gets Blessings of Isaignani Ilaiyaraaja

టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఆశీస్సులు అందుకున్నారు. ఈ మేరకు తన స్టూడియోకు విచ్చేసిన సందర్భంగా తాను దైవంలా, గురువులా భావించే ఇసైజ్ఞాని ఇళయరాజాకు దేవిశ్రీ ప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు. తొలిసారి తన స్టూడియోకు వచ్చిన సంగీత బ్రహ్మకు దగ్గరుండి స్టూడియో అంతటినీ తిప్పి చూపించారు. ఈ క్రమంలో స్టూడియోలో తాను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించుకున్న ఇళయరాజా భారీ ఫోటోను ఆయనకే చూపించి ఆశ్చర్యపరిచారు. అలాగే ఆ ఫోటో ముందు ఇళయరాజాతో కలిసి ఫోటో దిగారు. ఈ సందర్భంగా తన జీవిత కల నెరవేరిందని దేవిశ్రీ ప్రసాద్ పేర్కొన్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను రాక్ స్టార్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకోగా, అవి వైరల్ అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రాక్ స్టార్ తొలిసారి మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమై 25 ఏళ్ళు అయింది. 1999లో దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవి’ సినిమాతో ఆయన సినీ కెరీర్ ప్రారంభించారు. ఆ ఏడాది మార్చి 12న విడుదలైన ఈ సోషియో ఫాంటసీ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈ మూవీకి డీఎస్‌పీ అందించిన మ్యూజిక్ పెద్ద అస్సెట్ అయింది. సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఆ తరువాత నుంచి దేవిశ్రీ ప్రసాద్ వెనుదిరిగి చూసుకోలేదు. అక్కడి నుంచి నేటి వరకు 25 సంవత్సరాలుగా మోస్ట్ సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తనదైన సంగీతంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇటీవలే ‘పుష్ప’ చిత్రంలో తాను అందించిన మ్యూజిక్ కి గానూ నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు. ప్రస్తుతం దేవిశ్రీ ‘పుష్ప 2’తో పాటు త‌మిళంలో ‘ర‌త్తం’ సినిమా చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 4 =