ఓం భీమ్ బుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Om Bheem Bush Movie Trailer Release Date Fixed

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్’. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇక ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ‘ఓం భీమ్ బుష్’ మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు చిత్రంపై అంచనాలు పెంచేసింది. ఇందులో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కనిపించిన ప్రతి సీన్ అద్భుతంగా పేలింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ‘ఓం భీమ్ బుష్’ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ మేరకు చిత్ర బృందం తాజాగా వెల్లడించింది. సినిమా ట్రైలర్ శుక్రవారం (మార్చి 15, 2024) రోజున విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలిపింది. సామజవరగమన’తో హిట్ అందుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు ఈ ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో మరోసారి హిట్ కొట్టడం పక్కా అని అందరూ భావిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 15 =