ఎన్ బి కె 109లో దసరా విలన్ 

Shine Tom Chacko on board for NBK109

వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చి సూపర్ ఫామ్ లో వున్నాడు దర్శకుడు బాబీ.ఈ డైరెక్టర్ ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడు.అదే ఎన్ బి కె 109(వర్కింగ్ టైటిల్).రీసెంట్ గా చిన్న గ్లింప్స్ ను కూడా వదిలారు.ఈసినిమా బాలయ్య మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుందని ఆగ్లింప్స్ చూస్తే తెలుస్తుంది.ఇక మేకర్స్ ఈసినిమా క్యాస్టింగ్ విషయంలో ఎక్కడ తగ్గడం లేదు.ఇప్పటికే విలన్ పాత్రకు బాబీ డియోల్ ను తీసుకోగా దుల్కర్ సల్మాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా మరో స్టార్ యాక్టర్ ను ఓ పవర్ ఫుల్ రోల్ కోసం లాక్ చేశారట.ఇంతకీ ఆ నటుడు ఎవరంటే దసరా తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో.దాంతో క్యాస్టింగ్ తోనే సినిమాఫై అంచనాలు పెరిగిపోతున్నాయి.అయితే దుల్కర్ ,గౌతమ్ వాసుదేవ్ ,షైన్ టామ్ విషయంలో మేకర్స్ నుండి క్లారిటీ రావల్సివుంది.తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.అన్ని కుదిరితే ఈఏడాది చివర్లో విడుదలచేసే ఛాన్స్ వుంది.

మరోవైపు వరస విజయాలతో బాలకృష్ణ కూడా సూపర్ ఫామ్ లో వున్నాడు.గత ఏడాది వీరసింహారెడ్డి ,భగవంత్ కేసరిలతో వరస విజయాలను ఖాతాలో వేసుకున్నాడు మరి ఇప్పుడు తన 109 సినిమాతో  విజయపరంపరను కొనసాగిస్తాడో లేదో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − fourteen =