నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ.. రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా మూడు హిట్లతో బ్లాక్ బస్టర్ హిట్ల ను అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా నుండి రీసెంట్ గానే గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. పవర్ ఫుల్ గా ఉన్న గ్లింప్స్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఒక క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటిలో షూటింగ్ జరుగుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం షూటింగ్ ఫుల్ యాక్షన్ మోడ్ లో నడుస్తున్నట్టు తెలుస్తుంది. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.
కాగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: