గామి రేటింగ్ తగ్గడం పై విశ్వక్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

vishwak sen interesting post on gaami movie rating issue

విధ్యాధర కాగిట దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా గామి. ఈసినిమా రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ఈసినిమా 22 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం అయితే సక్సెస్ ఫుల్ గా థియేటరల్లో రన్ అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకున్న ఈసినిమా రేటింగ్స్ తగ్గడంపై తాజాగా విశ్వక్ సేన్ స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. ఇక పోస్ట్ లో ఏముందంటే.. గామి సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు ముందుగా ప్రేక్షకులకు థ్యాంక్స్.. అయితే ఈసందర్భంగా ఈసినిమా విషయంలో నా దగ్గరకు వచ్చిన ఒక సమస్య గురించి మాట్లాడాలనుకుంటున్నాను.. బుక్ మై షో లాంటి యాప్స్ లో ఈసినిమాకు కొందరు కావాలనే 10 కి 1 రేటింగ్ ఇస్తున్నారు.. దీనివల్ల 9 ఉన్న రేటింగి 1కి పడిపోయింది.. మీరు నన్ను ఎంత వెనక్కి లాగాలనుకున్నా నేను అంత రెట్టింపు వేగంతో ముందుకు వస్తాను..అయితే మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువు చేశారు..ఈసందర్భంగా మీడియా, క్రిటిక్స్ ముఖ్యంగా ప్రేక్షకులకు మరోసారి థ్యాంక్స్ చెబుతున్నాను.. దీనిపై లీగల్ గా చర్యలు తీసుకుంటా అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Vishwak Sen (@vishwaksens)

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =