
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 97


అభిమానులకు బన్నీ రిక్వెస్ట్

టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఫుల్ యాక్షన్ తో ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్

జెంటిల్‌మెన్ 2 కంపోజింగ్ త్వరలో ప్రారంభం

ఘనంగా జరిగిన శర్వానంద్ పెళ్లి వేడుక

ఆదిపురుష్ కు అతిథిగా చిన్న జీయర్ స్వామి

ఫిదా ఫస్ట్ ఛాయిస్ మహేష్ బాబు, దీపికా

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఖరారు

అప్పటివరకూ ఓజీ షూట్ లోనే పవన్?

మేజరు కు ఏడాది- ఎప్పటికీ రుణపడి ఉంటా

ఒడిశా రైలు ప్రమాదంపై సెలబ్రిటీల సంతాపం

బాలయ్య బర్త్ డే కి బ్లాస్టింగ్ అప్ డేట్

నాగ చైతన్య ఈసారి రియల్ స్టోరీ తో...

నెక్స్ట్ జనరేషన్ మాస్టర్ ఇన్ఫిరేషన్

తిరుపతి లో ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్ తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు.నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్న ప్రభాస్ ఈరోజు తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకొని సుప్రభాత సేవలో పాల్గొన్నాడు.ఇక ఈరోజు తిరుపతి లో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో సాయంత్రం 5గంటలకు ఈవేడుక ప్రారంభం కానుంది.ఈ ఈవెంట్ కు ప్రభాస్ తోపాటు సినిమా యూనిట్ అంతా హాజరుకానుంది.

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లలో హైలెట్స్
దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా అందులోనూ రామాయణం నేపథ్యంలో ఈసినిమా వస్తుండటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అందుకు తగ్గట్టే ఈసినిమాను భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా రూపొందించారు. మరికొద్ది రోజుల్లో సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం కూడా భారీ స్థాయిలో మునుపెన్నడూ జరగని విధంగా.. గుర్తుండుపోయేలా చేస్తున్నారు. అంతేకాదు…

అభిమానులకు బన్నీ రిక్వెస్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి కూడా విదితమే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సంచలన విజయాన్ని అందించింది. ఈసినిమాతోనే పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన బన్నీ మొదటి ప్రయత్నంతోనే దేశవ్యాప్తంగా తన ఇంపాక్ట్ ను చూపించాడు. ఎంతోమంది ఫ్యాన్స్ ను సైతం దక్కించుకున్నాడు. ఇక మొదటిపార్ట్ సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి పార్ట్ 2 పై పడింది. ఇక ఆదిశగానే షూటింగ్ కూడా జరుగుతుంది. సుకుమార్ సాలిడ్ కథనే తయారుచేశాడంటున్నారు.

టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ ఫిక్స్
యువ హీరో సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్ లో నటించిన డీజే టిల్లు అనూహ్యవిజయాన్ని సాధించింది. ఈసినిమాలో సిద్దు యాక్టింగ్ యూత్ ను ఫిదా చేసింది.దాంతో డీజే టిల్లు బాక్సాఫీస్ ను షేక్ చేసింది.ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.టిల్లు స్క్వేర్ టైటిల్ తో వస్తున్న ఈసీక్వెల్ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుటుంది.ఇందులో సిద్దు సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.డీజే టిల్లు ను విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.

ఫుల్ యాక్షన్ తో ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రామాయణం నేపథ్యంలో వస్తున్న సినిమా ఇది. ఈసినిమా ఈనెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

జెంటిల్‌మెన్ 2 కంపోజింగ్ త్వరలో ప్రారంభం
‘జెంటిల్‌మన్' నిర్మాత కె.టి. కుంజుమోన్' సౌత్ ఇండియన్ సినిమా ప్రముఖ నిర్మాతలలో ఒకరు. అద్భుతమైన చిత్రాలని నిర్మించిన బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించారు. శరత్‌కుమార్, దర్శకుడు శంకర్ వంటి గొప్ప ప్రతిభావంతులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన అరుదైన రికార్డ్ ఆయన సొంతం. గ్రాండ్ గా సినిమాలను నిర్మించడం, తన సినిమాలను ప్రమోట్ చేయడంలో ప్రత్యేకమైన శైలిని అనుసరించడంలో ఆయన పేరుపొందారు. ఇప్పుడు 'జెంటిల్‌మన్ 2' ద్వారా నిర్మాతగా ఆయన కమ్ బ్యాక్ గురించి ఇండస్ట్రీ, ట్రేడ్ సర్కిల్ మొత్తం ఆనందం వ్యక్తం చేస్తోంది.

ఘనంగా జరిగిన శర్వానంద్ పెళ్లి వేడుక
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ల సంఖ్య తగ్గిపోతుంది. ఈ రెండేళ్లలో ఎంతోమంది టాలీవుడ్ హీరోలు పెళ్లిచేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అసలు పెళ్లి చేసుకోను అని చెప్పిన రానానే పెళ్లి చేసుకోవడంతోనే చాలా మంది షాకయ్యారు. ఇక ఇప్పుడు ఆ బ్యాచ్ లర్ల్ లో లిస్ట్ లో మొదటి వరుసలో ఉన్న హీరో శర్వానంద్ కూడా ఓ ఇంటివాడయ్యాడు. తెలంగాణ హైకోర్ట్ న్యాయవాది మదుసూదన్ రెడ్డి కుమార్తె, రక్షితారెడ్డితో జనవరిలో శర్వా నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే కదా. ఐదు నెలల తర్వాత ఇప్పుడు వీరి వివాహం జరిగింది. రాజస్థాన్, జైపూర్ లోని శ్రీలీల ప్యాలెస్ లో శర్వానంద్ వివాహ వేడుక ఘనంగా జరిగింది.

భోళా శంకర్ నుండి భోళా మేనియా సాంగ్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ తో హిట్ ను కొట్టగా.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భోళా శంకర్. వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒకవైపు షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టారు.

ఆదిపురుష్ కు అతిథిగా చిన్న జీయర్ స్వామి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆదిపురుష్. రాామాయణం ఆధారంగా ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఎన్నో సార్లు వాయిదా పడిన అనంతరం ఈసినిమా ఫైనల్ గా జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కు మరికొద్ది రోజులు మాత్రమే ఉండటంతో చిత్రయూనిట్ కూడా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేసింది. మరోవైపు ఒక్కొక్కటిగా పాటలు రిలీజ్ చేస్తున్నారు. పాటలకు కూడా బాగా రెస్పాన్స్ వస్తుంది.

ఫిదా ఫస్ట్ ఛాయిస్ మహేష్ బాబు, దీపికా
ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాలు మరో హీరో చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. డేట్లు లేకనో లేక కథకు తాము కరెక్ట్ కాదనో పలు కారణాల వల్ల ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేయాల్సి ఉంటుంది. దానివల్ల కొందరూ సూపర్ హిట్లు కూడా మిస్ అవ్వొచ్చు. కొందరూ ఫ్లాప్ సినిమాల నుండి తప్పించుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా దేనికంటే ఓ సూపర్ హిట్ మూవీలో ఒక క్రేజీ కాంబినేషన్ చేయాల్సి ఉంది.. కానీ పలు కారణాల వల్ల ఆ కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఇంతకీ ఆ కాంబినేషన్ ఎవరిది? ఏంటా సినిమా అనుకుంటున్నారా? అదే వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ఫిదా సినిమా.. ఆ కాంబినేషన్ మహేష్ బాబు, దీపికా…

ఆదిపురుష్ కోసం బైక్ పై తిరుపతికి రానున్న మ్యూజిక్ డైరెక్టర్
ఈనెల 6న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి లో జరుగనుందని తెలిసిందే.ఈఈవెంట్ ను గ్రాండ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.ఏకంగా కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టి గ్రాండ్ గా జరుపనున్నారు. అంతేకాదు ఈఈవెంట్ లోచాలా సప్రైజ్ లు కూడా వున్నాయి.ఇక ఇదిలావుంటే ఈసినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ ద్వయం అజయ్- అతుల్ సంగీతం అందించారు.వారుసంగీతం అందించిన జై శ్రీరామ్ సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.ఇక వీరిలో అతుల్ ముంబై నుండి బైక్ మీద తిరుపతి లోజరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రానున్నాడు.

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఖరారు
మచ్ అవైటెడ్ ఆదిపురుష్ విడుదలకు సమయం దగ్గర పడుతుండడం తో ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేసారు మేకర్స్.అందులో భాగంగా ఈనెల 6న తిరుపతి లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియం లో సాయంత్రం 5గంటలకు ప్రారంభంకానుంది.ఈఈవెంట్ కోసం చాలా ఖర్చు చేసి ఎన్నడూ జరగని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో జరుపనున్నారు.ఈఈవెంట్ కోసం ముంబై నుండి 200మంది సింగర్లు అలాగే 200మంది డ్యాన్సర్లు రానున్నారు అలాగే ప్రత్యేకమైన టపాకాయలను తెప్పించనున్నారు. వీటికోసం భారీగా ఖర్చు చేయనున్నారు.

అప్పటివరకూ ఓజీ షూట్ లోనే పవన్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో సుజిత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఈసినిమా ఓజీ అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా పవన్ కళ్యాణ్ ఇందులో గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా షూటింగ్ ను మాత్రం చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఏడాది చివరిలోకల్లా ఎట్టి పరిస్థితిల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఆ దిశగానే షూటింగ్ కూడా జరుపుతున్నారు. రీసెంట్ గానే షూటింగ్ మొదలుపెట్టినా కూడా అప్పుడే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది చిత్రయూనిట్.

మేజరు కు ఏడాది- ఎప్పటికీ రుణపడి ఉంటా
టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరోల్లో అడివి శేష్ పేరు ముందుంటుంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. ఇక గత ఏడాది మేజర్ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ముంబై బాంబు దాడుల్లో అమర వీరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. దేశవ్యాప్తంగా ఈసినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుందో చూశాం కదా. శేష్ తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. సందీప్ పాత్రలో అడివి శేష్ పెర్ఫార్మన్స్, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు ఈ మూవీకి ప్రధాన బలంగా నిలిచాయి. రీసెంట్ గానే మాజీ రాష్టపతి శ్రీరామ్ నాథ్ కోవిద్ కూడా…

ఒడిశా రైలు ప్రమాదంపై సెలబ్రిటీల సంతాపం
ఒడిశా లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే కదా. కోల్‌కతాకు సమీపంలోని షాలిమార్ నుంచి తమిళనాడులోని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కి బయల్దేరిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు మరో ఆగి ఉన్న గూడ్స్ రైలుని ఢీకొట్టింది. ఒడిశాలోని బాలాసూర్ జిల్లా బహనగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలు బోగీలు పట్టాలు తప్పాయి. ఇక ఈ ఘోర ప్రమాదంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే దాదాపు 250 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందినట్టు తెలుస్తుంది. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

బాలయ్య బర్త్ డే కి బ్లాస్టింగ్ అప్ డేట్
ఈఏడాది వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు బాలకృష్ణ. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. NBK 108 అనే టైటిల్ తో ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమానుండి పలు పోస్టర్లను రిలీజ్ చేయగా పోస్టర్లు సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

ఓటీటీలో ఉగ్రం మూవీకి సూపర్ రెస్పాన్స్
నాంది సినిమా నుండి తన స్టోరీ సెలక్షన్ లో రూట్ మార్చాడు అల్లరి నరేష్. ప్రస్తుతం కాస్త సీరియస్, యాక్షన్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా ఉగ్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కింది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో నాంది రాగా ఆసినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కడంతో మరోసారి ఉగ్రం తీశారు. ఈసినిమా కూడా రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటిసారి అల్లరి నరేష్ అంత సీరియ్ రోల్ లో ఇంకా యాక్షన్ సీక్వెన్స్ లలో నటించి మెప్పించాడు.

నాగ చైతన్య ఈసారి రియల్ స్టోరీ తో...
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కు అనుకున్న విజయం దక్కడం లేదు.థాంక్యూ,లాల్ సింగ్ చడ్డా తరువాత రీసెంట్ గా కస్టడీ తో ప్రేక్షకులముందుకు వచ్చాడు చైతన్య అయితే ఈసినిమా కుడా యావరేజ్ గానే మిగిలిపోయింది.ముందునుంచి ఈసినిమా విజయం సాదిస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నాడు అన్ని తానై సినిమాను ప్రమోట్ చేసాడు కానీ ఫలితం మాత్రం నిరాశనే మిగిల్చింది.ఇక ఈసినిమా తరువాత తన నెక్స్ట్ సినిమా ఫైఫోకస్ పెట్టాడు చైతన్య.

భోళా శంకర్-భోళా మేనియా సాంగ్ ప్రోమో రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా భోళా శంకర్. వరుసగా గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకోగా ఈసినిమాతో హ్యాట్రిక్ ఎలాగైనా కొట్టాలన్న ఆశతో మెగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఈసినిమా వేదాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. స్మగ్లింగ్, గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ తో సిస్టర్ సెంటిమెంట్ లో ఈ సినిమా ఉండబోతుంది.

నెక్స్ట్ జనరేషన్ మాస్టర్ ఇన్ఫిరేషన్
ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులు పరిచయం అవుతుంటారు.. పోతుంటారు. కానీ కొంతమంది డైరెక్టర్లు మాత్రం తమ సినిమాలతో ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిలో స్థానాన్ని సొంతం చేసుకుంటాారు. అలాంటి డైరెక్టర్లలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఒకరు. మణిరత్నం సినిమా అంటే అదొక అద్భుతకావ్యంలా ఉంటుందని చెప్పొచ్చు. అందుకే ఇప్పటికీ మణిరత్నం నుండి సినిమా వస్తుందంటే అందరిలో ఆసక్తి ఉంటుంది. ఇకపల్లవి అనుపల్లవి అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మణిరత్నం ఆ తరువాత పలు సినిమా తీశాడు. అయితే నాయకుడు సినిమాతో దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించాడు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వచ్చిన సంచలన విజయం సాధించింది. ఇక తన కెరీర్ లో దళపతి…