
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 98

ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లోబల్ ఫిలిం అవుతుంది

గుంటూరు కారం ఆల్ టైమ్ రికార్డ్ వ్యూస్
నిఖిల్ 20 టైటిల్ రిలీజ్

షూటింగ్ పూర్తిచేసుకున్న జైలర్

ఇండియన్ 2 పదింతలు ఉంటుంది

బింబిసార2 ఇంట్రెస్టింగ్ డెవలప్ మెంట్

నాని 30- నెక్ట్స్ షెడ్యూల్ కోసం రెడీ

గీతా ఆర్ట్స్ అప్ కమింగ్ మూవీస్ అప్డేట్

బెల్లకొండ శ్రీనివాస్ న్యూ మూవీ అప్డేట్

విమానం ట్రైలర్ రిలీజ్-ఎమోషనల్ రైడర్

పెళ్లి చేసుకున్న దసరా డైరెక్టర్

భోళా శంకర్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

గుంటూరు కారం మరో బిగ్ అప్ డేట్ అప్పుడే

పవన్ OG రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్

SSMB 28 మాస్ స్ట్రైక్ వీడియో రిలీజ్

తండ్రి గురించి మహేష్ ఎమోషనల్ లెటర్

బోయపాటి రామ్ మూవీ అప్డేట్
ఉస్తాద్ రామ్,మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈసినిమాలోని క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ ను పూర్తి చేశారు.24రోజుల పాటు ఈ ఫైట్ ను షూట్ చేశారు.సో బోయపాటి మరో సారి భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చూపించనున్నాడు.దీనికి తోడు ఇటీవల ఫస్ట్ థండర్ తో వచ్చిన గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుని సినిమాపై అంచనాలు పెంచేసింది.
ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లోబల్ ఫిలిం అవుతుంది
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది ప్రాజెక్ట్ కే సినిమా గురించి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈసినిమా వస్తుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలను మరింత రెట్టింపు చేశాడు నాగ్ ఆశ్విన్ ఈసినిమా నుండి రిలీజ్ చేసిన రెండు వీడియోస్ తో. స్క్రాచ్ నుండి టైర్ ను తయారు చేయడం.. స్క్రాచ్ నుంచి రైడర్స్ లుక్ ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారో తెలుపుతూ వీడియోలు రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జస్ట్ గ్లింప్సే ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని సినిమా కోసం…

ఓటిటి లోకి పొన్నియిన్ సెల్వన్ 2
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం,పొన్నియిన్ సెల్వన్ 2 రీసెంట్ గా విడుదలై సూపర్ హిట్ అనిపించుకుంది.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 300కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.గత ఏడాది విడుదలైన ఫస్ట్ పార్ట్ 400కోట్ల కు వసూళ్లను రాబట్టింది.మొదటి భాగం కంటే రెండో భాగం కు టాక్ బాగున్నప్పటికీ మొదటి భాగం కలెక్షన్స్ ను బీట్ చేయలేకపోయింది.ఇక పొన్నియిన్ సెల్వన్ 2 ఓటిటి లోకి వచ్చేసింది.అమెజాన్ ప్రైమ్ నేటి నుండి ఈసినిమాను తెలుగు తోపాటు తమిళ ,కన్నడ ,మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.

గుంటూరు కారం ఆల్ టైమ్ రికార్డ్ వ్యూస్
అలా వచ్చాడో లేదో అప్పుడ్ రికార్డులు క్రియేట్ చేయడం మొదలుపెట్టేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో గుంటూరు కారం అనే మాసీ టైటిల్ తో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. అయితే ఈసినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండీ పెద్దగా అప్ డేట్లు ఇచ్చింది లేదు చిత్రయూనిట్. మధ్యలో ఏదో ఒకటి రెండు పోస్టర్లు రిలీజ్ చేశారు అంతే. దాంతో ఈసినిమా నుండి సాలిడ్ అప్ డేట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు పర్ఫెక్ట్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్.
నిఖిల్ 20 టైటిల్ రిలీజ్
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుసగా విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నిఖిల్. గతంలో కన్నా మరింత విభిన్నంగా సినిమాలను సెలక్ట్ చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది కార్తికేయ2, 18 పేజీస్ సినిమాలతో సూపర్ హిట్లను అందుకున్నాడు. ఇప్పుడు తను రిలీజ్ కు సిద్దం చేస్తున్న సినిమా మరో డిఫరెంట్ మూవీ స్పై. గారీ బి.హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ స్పై సినిమా వస్తుంది. సుభాష్ చంద్రబోస్ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. అంతేకాదు ఈసినిమా టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాతో కూడా నిఖిల్ హిట్ ను కొడతాడన్న అంచనాలు పెరిగిపోయాయి…

షూటింగ్ పూర్తిచేసుకున్న జైలర్
తమిళ్ స్టార్ హీరో రజినీ కాంత్ ఈ వయసులో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తలైవా రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా జైలర్. అన్నాత్తే తరువాత చాలా లాంగ్ గ్యాప్ తో వస్తున్న సినిమా ఇది. దీంతో ఈసినిమా కోసం రజినీకాంత్ అభిమానులు కూడా ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈసినిమాను కూడా ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది.

ఇండియన్ 2 పదింతలు ఉంటుంది
లెజెండరీ డైరెక్టర్ శంకర్ రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఇండియన్2 సినిమా ఒకటి. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలుసు. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. దాదాపు సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. జులై వరకూ ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే అవకాశాలే ఉన్నాయి.

బింబిసార2 ఇంట్రెస్టింగ్ డెవలప్ మెంట్
నందమూరికళ్యాణ్ రామ్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ ఏడాది అమిగోస్ అంటూ డిఫరెంట్ కథతో వచ్చాడు. ఈసినిమాలో మూడు పాత్రలో నటించాడు.. అయితే ఈసినిమా మిశ్రమ ఫలితాన్ని అందించింది. ఇక ఇప్పుడు డెవిల్ అంటూ వచ్చేస్తున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఎంత సైలెంట్ గా సెట్స్ పైకి వెళ్లిందో అంతే సైలెంట్ గా షూటింగ్ ను జరుపుకుంటూ వచ్చింది. ఇక ఇన్ని రోజులు షూటింగ్ లో ఉండగా తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను…

నాని 30- నెక్ట్స్ షెడ్యూల్ కోసం రెడీ
న్యాచురల్ స్టార్ నాని ఈ ఏడాది దసరా తో మంచి స్టార్టప్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాను రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు. నాని ప్రధాన పాత్రలో శౌర్యవ్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నాని 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ముందు గోవాలో ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టి.. ఆతరువాత ముంబై షెడ్యూల్ ను మొదలుపెట్టారు.

గీతా ఆర్ట్స్ అప్ కమింగ్ మూవీస్ అప్డేట్
రీసెంట్ గా తెలుగు లో విడుదలై బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది మలయాళం మూవీ 2018.ఆరు రోజుల్లో ఈసినిమా 6కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.తెలుగులో ఈసినిమాను బన్నీ వాస్ రిలీజ్ చేశాడు. ఇక సినిమా సక్సెస్ అవ్వడంతో ఈరోజు సక్సెస్ మీట్ నిర్వహించారు.ఈమీట్ కు ప్రముఖ నిర్మాత ,గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా తమ బ్యానర్ నుండి రానున్న సినిమాల గురించి అల్లు అరవింద్ వాఖ్యానించారు.

బెల్లకొండ శ్రీనివాస్ న్యూ మూవీ అప్డేట్
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 10వ సినిమాను భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నాడు.14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై రామ్ ఆచంట,గోపి ఆచంట నిర్మించనున్నారు.ఈరోజు ఈసినిమా లాంచ్ అయ్యింది.ఈకార్యక్రమానికి ప్రముఖ డైరెక్టర్లు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి,పరుశురాం పెట్ల ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు.

విమానం ట్రైలర్ రిలీజ్-ఎమోషనల్ రైడర్
శివప్రసాద్ యానాల దర్శకత్వంలో సముద్రఖని ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా విమానం. ఈసినిమాలో సముద్రఖని దివ్యాంగుడిగా నటిస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక జూన్ 9వ ఈసినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

పెళ్లి చేసుకున్న దసరా డైరెక్టర్
మొదటి సినిమాతో డైరెక్టర్ గాఇండస్ట్రీలో సాలిడ్ మార్క్ ను వేసుకున్నాడు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల. తాజాగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలపెళ్లి చేసుకున్నాడు. తన హోమ్ టౌన్ అయిన కరీనంగర్ జిల్లా గోదావరి ఖని లో పెళ్లి చేసుకొని ఒక ఇంటివాటయ్యాడు. తన మొదటి సినిమా రిలీజ్ అయిన తరువాతే తను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు శ్రీకాంత్. అనుకున్నట్టే దసరా రిలీజ్ అయిన తరువాత పెళ్లి చేసుకున్నాడు. ఇక శ్రీకాంత్ పెళ్లికి టాలీవుడ్ నుండి పలువురు సెలబ్రిటీీలు కూడా హాజరయ్యారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు, డైరెక్టర్ అనుదీప్ ఇలా పలువురు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే నాని షూటింగ్ తో బిజీగా…

భోళా శంకర్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తరువాత వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా ఒక సినిమా తరువాత మరో సినిమా చేసేస్తున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ కొట్టిన చిరు ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సగంతి తెలిసిందే. ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

గుంటూరు కారం మరో బిగ్ అప్ డేట్ అప్పుడే
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రస్తుతం ఫుల్ ఖుషీలో ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్--మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక మహేష్ ఫ్యాన్స్ ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న ఈసినిమా టైటిల్ ను అయితే రిలీజ్ చేశారు. ఈసినిమాకు గుంటూరు కారం అనే ఫుల్ మాసీ టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ మాత్రమే కాదు మహేష్ బాబు కూడా ఈసినిమాలో అలానే కనిపిస్తున్నాడు. త్రివిక్రమ్-మహేష్ సినిమా అనగానే క్లాసీ టచ్ ఉంటుదేమో అని ముందునుండీ అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ గ్లింప్స్ తో ఎంత మాసీ అండ్ కమర్షియల్ గా ఉండబోతుందో అర్థమవుతుంది. గత…

పవన్ OG రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోరు మీదున్నాడు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సముద్రఖని దర్శకత్వంలో బ్రో మూవీ, సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమాలు ప్రస్తుతం పవన్ లిస్ట్ లో ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. అయితే వీటిలో లేట్ గా సెట్స్ పైకి వచ్చిన బ్రో సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసేశాడు పవన్ కళ్యాణ్. ఈసినిమాను జులైలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

SSMB 28 మాస్ స్ట్రైక్ వీడియో రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూమెంట్ వచ్చేసింది.SSMB 28 టైటిల్ వీడియో ను కొద్దిసేపటి క్రితం విడుదలచేశారు మేకర్స్.మాస్ స్ట్రైక్ పేరుతో కృష్ణ జయంతి సందర్భంగా ఈటైటిల్ వీడియో ను రిలీజ్ చేశారు.మొదట ఈటైటిల్ వీడియో ని ఫ్యాన్స్ చేత థియేటర్ లో లాంచ్ చేయించగా ఆ తరువాత యూట్యూబ్ లోకి వదిలారు.ఇక ఈసినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా గ్లింప్స్ కూడా అదిరిపోయింది.గ్లింప్స్ చూస్తుంటే సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లుగా వుంది అలాగే వీడియోలో మహేష్ లుక్ అదిరిపోయింది.దానికితోడు యాక్షన్స్ సీన్స్ ,థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలాగే గుంటూరు…

ఉగ్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సినిమా ఉగ్రం. నాంది తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. మిస్సింగ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుస మిస్సింగ్ కేసులు నమోదు కావడం, వాటిని అల్లరి నరేశ్ పోలీసాఫీసర్‌గా ఎలా చేధించాడనే నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమాలో అల్లరి నరేష్ డ్యూయల్ షేడ్స్‌లో ప్రేక్షకులు ఇదివరకెన్నడూ చూడని లుక్‌లో కనిపించి.. మంచి టాక్ నే సొంతం చేసుకున్నాడు. నటనపరంగా మరోసారి సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు నరేష్. ఈ సినిమాలో ఫైట్స్ అయితే అదిరిపోయాయి. కలెక్షన్స్ పరంగా కూడా డీసెంట్ కలెక్షన్స్ ను…

తండ్రి గురించి మహేష్ ఎమోషనల్ లెటర్
అలనాటి అందాల నటుడు సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అంటే కృష్ణ అని మారుపేరు. అందుకే తన కేరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఇక నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా, టాలీవుడ్ లో మొట్టమొదటి కౌబాయ్ సినిమా అయిన మోసగాళ్లకు మోసగాడు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈసందర్భంగా మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ లెటర్ ను షేర్ చేశారు.

మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి నుండి హతవిధీ సాంగ్ రిలీజ్
ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న క్రేజీ కాంబినేషన్స్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క, యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టిది. మహేష్ బాబు.పి దర్శకత్వంలో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నసినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈసినిమాాపై ముందు నుండీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈసినిమాలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా నటిస్తుండగా అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈనేపథ్యంలో ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ వస్తున్నారు. రీసెంట్ గానే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.