ఈఏడాది వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు బాలకృష్ణ. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. NBK 108 అనే టైటిల్ తో ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమానుండి పలు పోస్టర్లను రిలీజ్ చేయగా పోస్టర్లు సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాకు సంబంధించి సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చేశారు మేకర్స్. జూన్ 10 బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి బ్లాస్టింగ్ అప్ డేట్ ఇవ్వనున్నట్టు చిత్రనిర్మాణ సంస్థ తెలియచేసింది. అప్ డేట్లు లోడ్ అవుతున్నాయి.. అప్పటివరకూ వెయిట్ చేయండి అంటూ అభిమానుల్లో ఎగ్జయిట్ మెంట్ పెంచారు. అయితే ఆరోజు టైటిల్ ను రిలీజ్ చేస్తారన్న వార్తలు అప్పుడే వచ్చాయి. మరి చూద్దాం టైటిల్ ను రిలీజ్ చేస్తారా? లేదా ఇంకేదైనా అప్ డేట్ ఉంటుందా?
అన్న దిగుతుండు 😎
Team #NBK108 is gearing up to celebrate #NBKLikeNeverBefore on his birthday 💥
Bombarding Updates Loading Soon🥁
Stay hyped for his Arrival🔥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7 @harish_peddi… pic.twitter.com/lVDOM3Kjdx
— Shine Screens (@Shine_Screens) June 3, 2023
కాగా ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇక ఈసినిమాలో బాలకృష్ణ కుమార్తెగా శ్రీలీల అలరించనుందంట. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: