మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా భోళా శంకర్. వరుసగా గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకోగా ఈసినిమాతో హ్యాట్రిక్ ఎలాగైనా కొట్టాలన్న ఆశతో మెగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఈసినిమా వేదాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. స్మగ్లింగ్, గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ తో సిస్టర్ సెంటిమెంట్ లో ఈ సినిమా ఉండబోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు చిత్రబృందం. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ డేట్ కూడా నిన్న ప్రకటించారు. భోళా మేనియా అంటూ ఈ పాట రాబోతుంది. ఇక తాజాగా ఈ పాట ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ బీట్ తో వచ్చిన ఈప్రోమో అయితే ఆకట్టుకుంటుంది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫి అందించారు. ఫుల్ సాంగ్ ను జూన్ 4వ తేదీన రిలీజ్ కానుంది.
కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు. ఈసినిమా ఆగష్ట్ 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: