ఒడిశా రైలు ప్రమాదంపై సెలబ్రిటీల సంతాపం

tollywood celebrities offer deep condolences to odisha train accident victims

ఒడిశా లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే కదా. కోల్‌కతాకు సమీపంలోని షాలిమార్ నుంచి తమిళనాడులోని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కి బయల్దేరిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు మరో ఆగి ఉన్న గూడ్స్ రైలుని ఢీకొట్టింది. ఒడిశాలోని బాలాసూర్ జిల్లా బహనగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలు బోగీలు పట్టాలు తప్పాయి. ఇక ఈ ఘోర ప్రమాదంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే దాదాపు 250 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందినట్టు తెలుస్తుంది. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సంఘ‌ట‌న‌పై టాలీవుడ్ సెల‌బ్రిటీలు, స్టార్ హీరోలు సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందిస్తున్నారు. ప్ర‌మాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేస్తూ మృతుల కుటుంబాల‌కు త‌మ ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరు కూడా ప్రమాదంపై స్పందిస్తూ సంతాపం తెలియచేశారు. ఒడిశాలో జ‌రిగిన విషాద‌క‌ర‌మైన కోర‌మాండ‌ల్ ఎక్స్‌ప్రెస్ ప్ర‌మాదం, దాని వ‌ల్ల జ‌రిగిన భారీ ప్రాణ న‌ష్టం గురించి విని తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యాను. మృతుల కుటుంబాల‌కు నా ప్ర‌గాఢ‌ సానుభూతి. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారిని ర‌క్షించేందుకు భారీగా ర‌క్త యూనిట్‌లు అవ‌స‌రం ఉంద‌ని నేను అర్థం చేసుకున్నాను. సాధ్య‌మైనంత వ‌ర‌కు వెంట‌నే ర‌క్త యూనిట్‌ల‌ని అందించాల‌ని అభిమానుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన ట్టిటర్ ద్వారా స్పందించారు. ఒడిశా రైలు ప్ర‌మాదం తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసింది. ఈ ప్ర‌మాదంలో 278 మంది ప్ర‌యాణికులు మృత్యు వాత ప‌డ‌టం దుర‌దృష్ట‌క‌రం. మృతుల కుటుంబాల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను. ప్ర‌మాదానికి గురైన కోర‌మాండ‌ల్ ఎక్స్ ప్రెస్‌, బెంగ‌ళూరు – హౌరా సూప‌ర్ ఫాస్ట్ రైళ్ల‌లో తెలుగు రాష్ట్రాల ప్ర‌యాణికులు ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం అందుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాలు బాధిత ప్ర‌యాణికులు, వారి కుటుంబాల‌కు స‌హాయం అందించేందుకు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని కోరుకుంటున్నాను. ఈ దుర్ఘ‌ట‌న నేప‌థ్యంలో రైలు ప్ర‌మాద ఘ‌ట‌న నివార‌ణ‌కు సంబంధించిన భ‌ద్ర‌త చ‌ర్య‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం వెంట‌నే దృష్టి పెట్టాలి అంటూ లేఖ లో పేర్కొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రమాదంపై స్పందించాడు. ప్రస్తుతం తను వెకేషన్ లో ఉన్నా.. సంఘటన గురించి తెలుసుకొని ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఇలాంటి కష్టసమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ట్వీట్ లో పేర్కొన్నాడు.

సాయి ధరమ్ తేజ్ ఈ ప్రమాదంపై స్పందిస్తూ ఉదయాన్నే ఇంత భయంకరమైన సంఘటన గురించి వినడం జీర్ణించుకోలేకపోతున్నాను.. మృతుల కుటుంబసంభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాను.. అలానే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు.

ఇంకా టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, రామ్ చరణ్, యంగ్ హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్, నిఖిల్ కూడా ఈ సంఘటనపై స్పందిస్తూ మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + seven =