అప్పటివరకూ ఓజీ షూట్ లోనే పవన్?

interesting update on pawan kalyans og movie shooting

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో సుజిత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఈసినిమా ఓజీ అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా పవన్ కళ్యాణ్ ఇందులో గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా షూటింగ్ ను మాత్రం చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఏడాది చివరిలోకల్లా ఎట్టి పరిస్థితిల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఆ దిశగానే షూటింగ్ కూడా జరుపుతున్నారు. రీసెంట్ గానే షూటింగ్ మొదలుపెట్టినా కూడా అప్పుడే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. పవన్ పొలిటికల్ పరంగా ఈ జూన్ 14 నుంచే తన వారాహి యాత్రని స్టార్ట్ చేయనున్నట్టుగా కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో అప్పటి వరకూ పవన్ ఓజీ షూటింగ్ లోనే పాల్గొంటున్నాడట. ఈసినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ కూడా చూస్తున్నాడు.. దీంతో యాత్ర ప్రారంభం లోపు ఆ డేట్స్ అన్నీ ఓజీ సినిమాకే ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట.

ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − fourteen =