యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కు అనుకున్న విజయం దక్కడం లేదు.థాంక్యూ,లాల్ సింగ్ చడ్డా తరువాత రీసెంట్ గా కస్టడీ తో ప్రేక్షకులముందుకు వచ్చాడు చైతన్య అయితే ఈసినిమా కుడా యావరేజ్ గానే మిగిలిపోయింది.ముందునుంచి ఈసినిమా విజయం సాదిస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నాడు అన్ని తానై సినిమాను ప్రమోట్ చేసాడు కానీ ఫలితం మాత్రం నిరాశనే మిగిల్చింది.ఇక ఈసినిమా తరువాత తన నెక్స్ట్ సినిమా ఫైఫోకస్ పెట్టాడు చైతన్య.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతానికి ఓ స్టోరీకి ఒకే చెప్పాడు.ఇది గీతా ఆర్ట్స్ 2 నిర్మించనుంది.డైరెక్టర్ మాత్రం ఎవరు అనేది ఇంకా తేలలేదు.ఇక ఈ సినిమా మెయిన్ పాయింట్ ను రివీల్ చేశాడు నిర్మాత బన్నీ వాస్.ఈయన ఇటీవల మలయాళం మూవీ 2018 ని తెలుగులో రిలీజ్ చేశారు.తెలుగు ప్రేక్షకులు కూడా సినిమాను బాగా రిసీవ్ చేసుకున్నారు.వారం రోజుల్లో 7కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి భారీ లాభాలను తీసుకొచ్చింది.ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ వాస్ ఓ ఇంట్రాక్టింగ్ వీడియోలో చైతన్య సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నాగ చైతన్య నెక్స్ట్ మూవీ లో తండేల్ అనే రోల్ లో కనిపించనున్నారు.తండేల్ అంటే బోటు నడిపేవాడని అర్ధం.ఇది గుజరాత్ లో జరిగిన రియల్ స్టోరీ.ఓ ఫిషర్ మెన్ తన ప్రేమ కోసమే ఏం చేసాడని ఈసినిమా కథ.ఇందులో ఆ ఫిషర్ మెన్ పాత్రలో నాగ చైతన్య కనిపించనున్నాడ ని బన్నీ వాస్ అన్నారు అయితే ఈసినిమాకు డైరెక్టర్ ఎవరు ఏంటి అనేది వెల్లడించలేదు.కార్తికేయ ఫేమ్ చందూ మొండేటి తో నాగ చైతన్య ఓ సినిమా చేయాల్సివుంది.మరి ఈసినిమాను అతనే డైరెక్ట్ చేస్తాడా లేదా అనేది మరి కొద్దీ రోజుల్లో తేలిపోనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: