నెక్స్ట్ జనరేషన్ మాస్టర్ ఇన్ఫిరేషన్

kamal haasan heartfelt birthday wishes to director maniratnam

ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులు పరిచయం అవుతుంటారు.. పోతుంటారు. కానీ కొంతమంది డైరెక్టర్లు మాత్రం తమ సినిమాలతో ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిలో స్థానాన్ని సొంతం చేసుకుంటాారు. అలాంటి డైరెక్టర్లలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఒకరు. మణిరత్నం సినిమా అంటే అదొక అద్భుతకావ్యంలా ఉంటుందని చెప్పొచ్చు. అందుకే ఇప్పటికీ మణిరత్నం నుండి సినిమా వస్తుందంటే అందరిలో ఆసక్తి ఉంటుంది. ఇకపల్లవి అనుపల్లవి అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మణిరత్నం ఆ తరువాత పలు సినిమా తీశాడు. అయితే నాయకుడు సినిమాతో దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించాడు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వచ్చిన సంచలన విజయం సాధించింది. ఇక తన కెరీర్ లో దళపతి, ఇద్దరు,ఘర్షణ, గీతాంజలి, అంజలి, రోజా ఇలా ఎన్నో క్లాసిక్ సినిమాలను అందించాడు. మ్యూజికల్ గా కూడా ఈసినిమా పాటలు ఇంకా వింటూనే ఉంటాం. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ తో కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు మణిరత్నం పుట్టినరోజు. ఈసందర్భంగా కమల్ హాసన్ తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపారు. ఎవరైనా తమ చుట్టూ ఉండే ఆనందాన్ని బట్టి జీవితాన్ని లెక్కిస్తే లేదా.. మీ చుట్టూ ఉండే స్నేహితులు వయస్సును లెక్కిస్తే డియర్ ఫ్రెండ్ మణిరత్నం మీరు ఈ రోజు చాలా పెద్ద వ్యక్తి అవుతారు. మీరు భారతీయ సినీ పరిశ్రమలో చెప్పుకోతగ్గ మనిషి.. మీ ఆర్ట్ ద్వారా మిలియన్ల మంది హృదయాలను హత్తుకున్నారు.. అంతేకాదు అందమైన డైలాగ్‌లను మనోహరమైన దృశ్య కావ్యంగా మార్చిన వ్యక్తి మీరు. ఎప్పటికప్పుడు సినీ పరిశ్రమలో ఉన్న సరిహద్దులను చేరిపేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్ వారికి ఇన్ఫిరేషన్ ఉన్నారు.. వారి ద్వారా మీ వారసత్వం శాశ్వతంగా ప్రదర్శితమవుతూనే ఉంటుది. నాయకన్ నుండి KH234 వరకు మన ప్రయాణం వ్యక్తిగతంగా నాకు గిఫ్ట్ లాంటిది. హ్యాపీ బర్త్ డే మై డియర్ ఫ్రెండ్ అంటూ ట్వీట్ లో పోస్ట్ చేశాడు.

ఇదిలా ఉండగా మణిరత్నం, కమల్ కాంబినషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. KH 234అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా రానుంది. వీరిద్దరి కాంబినేషన్ లో 1987లో నాయగన్ సినిమా వచ్చింది. ఆసినిమా సంచలన విజయం దక్కించుకుంది. ఇక ఇన్నేళ్ల తరువాత మరోసారి కలిసి పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.