
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 89


త్వరలో VT13 పవర్ ఫుల్ టైటిల్ అనౌన్స్ మెంట్

ఊరు పేరు భైరవకోన షూటింగ్ పూర్తి

సిటాడెల్ సెర్బియా షెడ్యూల్ కంప్లీట్

ఆదిపురుష్ 10డేస్ కలెక్షన్స్

శ్రీసింహా భాగ్ సాలే ట్రైలర్ రిలీజ్

ఫుల్ స్వింగ్ లో OG- మూడో షెడ్యూల్ కంప్లీట్

థ్రిల్లింగ్ గా సర్కిల్ మూవీ ట్రైలర్

ప్రాజెక్ట్ కే లోకి కమల్ హాసన్

దేవర కీలక వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్

జపాన్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న కార్తీ

భాగ్ సాలే ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

భోళా శంకర్ టీజర్ రిలీజ్

సామజవరగమన ట్రైలర్ కోసం మెగాస్టార్

కంగనా ఎమర్జెన్సీ టీజర్ రిలీజ్

గుంటూరు కారం షూటింగ్ షురూ

భోళా శంకర్ సెట్ లో లాస్ట్ డే
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయిన కొద్దిరోజులకే చిరంజీవి ఈసినిమా షూటింగ్ లోో పాల్గొన్నాడు. అప్పటినుండీ ఎలాంటి బ్రేక్స్ తీసుకోకుండా ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటూ వెళ్లారు చిత్రబృందం. అందుకే ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక ఒకవైపు షూటింగ్ ను పూర్తి చేస్తూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి పలు అప్ డేట్లు ఇచ్చారు. అంతేకాదు టీజర్ కూడా రిలీజ్ చేసేశారు. టీజర్ అయితే సినిమాకు మరింత హైప్ ను…

త్వరలో VT13 పవర్ ఫుల్ టైటిల్ అనౌన్స్ మెంట్
మెగా కాంపౌండ్ నుండి వచ్చిన యంగ్ హీరోలు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం ఎవరికి వారు తమ కెరీర్ లో దూసుకుపోతున్నారు. అంతేకాదు తమ సినిమాలతో ప్రతిఒక్కరు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వారిలో మెగా ప్రిన్స్ గా పేరుతెచ్చుకున్న నటుడు వరుణ్ తేజ్. మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు వరుణ్ తేజ్. అందుకే వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ఇక ఈఏడాది గనితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తరువాత ఎఫ్ 3 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.

ఊరు పేరు భైరవకోన షూటింగ్ పూర్తి
సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఇక ఈఏడాది మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్ ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా ఊరు పేరు భైరవ కోన. ఈ సినిమా మొత్తం గరుడపురాణం బ్యాక్ డ్రాప్ గా తీసుకొని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. గరుడపురాణంలో మిస్సయిన నాలుగు పేజీల్లో ఏముంది అనే సస్పెన్స్ తో ఈసినిమా వస్తుంది.

సిటాడెల్ సెర్బియా షెడ్యూల్ కంప్లీట్
రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న వెబ్ సిరీస్ సిటాడెట్. స్పై యాక్షన్ నేపథ్యంలో ఈసిరీస్ రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ ను ఇంగ్లీష్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఇంగ్లీష్ లో రిచర్డ్ మేడెన్, ప్రియాంక చోప్రా నటించారు. ఏప్రిల్ 28 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది కూడా. దీని హిందీ వెర్షనే ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ నిర్మాతలు రుసో సోదరులు ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసిరీస్ షూటింగ్ దశలో ఉంది.

సిస్టర్స్‌తో సాయి ధరమ్ తేజ్ సెల్ఫీ.. సోషల్ మీడియాలో వైరల్
'విరూపాక్ష' సినిమాతో తొలిసారిగా 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మాంచి జోష్ లో ఉన్నాడు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో 'సిస్టర్స్ (స్ట్రెస్) డే అవుట్' అంటూ ఫన్నీ క్యాప్షన్‌తో కూడిన ఒక పోస్ట్ పెట్టాడు. ఇందులో తన సిస్టర్స్ (తన కజిన్స్)తో తీసుకున్న సెల్ఫీలను సాయి ధరమ్ తేజ్ పంచుకున్నాడు. అలాగే వీడియోల నేపథ్యంలో కొన్ని అన్నదమ్ముల సెంటిమెంట్ పాటలను జోడించడం ద్వారా తన సిస్టర్స్ తో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నాడు.

ఆదిపురుష్- ప్రభాస్ రేంజ్.. ఇంకా హౌస్ ఫుల్ బోర్డ్స్
ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన పౌరాణిక సినిమా ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో ఆదిపురుష్ వస్తుండటంతో మొదటి నుండీ ఈసినిమాపై భారీ అంచనాలు పెరగడంతో పాటు దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఫైనల్లీ జూన్ 16వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రిలీజ్ అయిన తరువాత మాత్రం సీన్ రివర్స్ అయింది. ఈసినిమా కు మిక్డ్స్ టాక్ వచ్చింది. దీనికితోడు పెద్ద ఎత్తున కాంట్రవర్సీలు కూడా తెరపైకి వచ్చాయి. ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఇవన్నీ ఒకఎత్త్తైతో మరో వైపు ఈసినిమా ఊపు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ప్రభాస్ సత్తా ఏంటో ఈసినిమాతో మరోసారి రుజువు అవుతుంది…

ఆదిపురుష్ 10డేస్ కలెక్షన్స్
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ 450కోట్ల క్లబ్ లో చేరింది.టాక్ తో సంబంధం లేకుండా ఈసినిమా మంచి వసూళ్లను రాబట్టుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా 10రోజుల్లో 450కోట్ల గ్రాస్ ను రాబట్టిందని మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఇక అటు తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఆదివారం కావడంతో మంచి వసూళ్లను దక్కించుకుంది. రెండో రాష్ట్రాల్లో కలిపి నిన్న ఈసినిమా 4కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 100కోట్లను కలెక్ట్ చేయాల్సివుంది.

శ్రీసింహా భాగ్ సాలే ట్రైలర్ రిలీజ్
ప్రణీత్ బ్రమాండపల్లి దర్శకత్వంలో శ్రీసింహా హీరోగా వస్తున్న సినిమా భాగ్ సాలే. గతంలో వచ్చిన తెల్లవారితే బుధవారం, దొంగలుపడ్డారు జాగ్రత్త సినిమాలు అనుకున్నంత విజయాన్ని అందించలేకపోవడంతో ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు శ్రీసింహా. జులై 7వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే పేరుతో వీడియోను రిలీజ్ చేసి సినిమాపై క్యూరియాసిటీని పెంచారు. ఆవీడియోను బట్టి ఈసినిమా ఓ వజ్రపు ఉంగరం చుట్టూ తిరుగుతుందనేది అర్థమైంది.

ఫుల్ స్వింగ్ లో OG- మూడో షెడ్యూల్ కంప్లీట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఓజీ. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమా పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ ను ఈమధ్యనే ప్రారంభించారు. అయితే ఈసినిమా మాత్రం ఎక్కడా గ్యాప్స్ లేకుండా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. అలా షూటింగ్ మొదలుపెట్టారో లేదో అప్పుడే సగం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. తాజాగా ఈసినిమా షూటింగ్ అప్ డేట్ ను ఇచ్చింది చిత్రయూనిట్. యాక్షన్, ఎపిక్, డ్రామాతో కూడిన ఈసినిమా మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుందని.. తాజాగా మూడో షెడ్యూల్ పూర్తయిందని.. దీనితో ఈసినిమా…

థ్రిల్లింగ్ గా సర్కిల్ మూవీ ట్రైలర్
నేషనల్ అవార్డ్ విన్నర్, డైరెక్టర్ నీలకంఠ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మిస్సమ్మ, సదా మీ సేవలో, విరోధి సినిమాలతో తెలుసు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఇక చాలా గ్యాప్ తరువాత నీలకంఠ తెలుగులో మరో సినిమాతో అలరించడానికి వచ్చేస్తున్నాడు. నీలకంఠ దర్శకత్వంలో సాయి రోనక్ హీరోగా సర్కిల్ సినిమా వస్తుంది. థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వస్తున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ తో అర్థమైపోయింది. ఒక ఫొటోగ్రాఫర్ జీవితం చుట్టూ తిరిగే కథ సర్కిల్. తన జీవితంలో శత్రువులెవరో, మిత్రులెవరో తెలియని సందిగ్ధంలో హీరో ఏం చేశాడనేది ఆసక్తికరంగా చూపించబోతున్నారు దర్శకుడు నీలకంఠ.

ప్రాజెక్ట్ కే లోకి కమల్ హాసన్
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కే.భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.వైజయంతి మూవీస్ నుండి వస్తున్న 50వ సినిమా కావడంతో చాలా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతుంది.కాస్టింగ్ విషయంలో మేకర్స్ ఎక్కడా తగ్గడం లేదు.ఇప్పటికే బాలీవుడ్ లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది.దిశా పటాని మరో కీలక పాత్రలో కనిపించనుంది.ఇక ఇప్పుడు మరో స్టార్ ఆడ్ అయ్యారు.

దేవర కీలక వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా షూటింగ్ ఈమధ్య కాలంలోనే ప్రారంభమై ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా ఈసినిమా షూటింగ్ శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏరియాలో స్పెషల్ సెట్ లో జరుగుతుంది. రెండు వారాల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో కీలక యాక్షన్ సీక్వెన్స్ జరిగినట్టు తెలుస్తుంది. హాలీవుడ్ యాక్షన్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ జరిగినట్టు సమాచారం.

జపాన్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న కార్తీ
రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ 2 సినిమాతో హిట్ ను అందుకున్న కార్తీ ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు రెడీ అయిపోయాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. ఇక ఈసినిమా కూడా డిఫరెంట్ గా ఉండబోతుందని రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ తో అర్థమైపోయింది. ఈ గ్లింప్స్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. డిఫరెంట్ మేకోవర్ తో కార్తీ గెటప్ ఆకట్టుకుంటుంది.

భాగ్ సాలే ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మొదటి సినిమా 'మత్తు వదలరా' లాంటి భిన్నమైన సినిమాను తీసి విమర్శకుల ప్రసంశలు సైతం దక్కించుకున్నాడు కీరవాణి తనయుడు శ్రీ సింహా. ఆ తరువాత తెల్లవారితే గురువారం, దొంగలుపడ్డారు జాగ్రత్త సినిమాలు చేశాడు. అవి సరైన విజయాన్ని అయితే అందించలేకపోయాయి. క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ఈమధ్య నుండే మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి రీసెంట్ గా వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే అనే వీడియోను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు…

భోళా శంకర్ టీజర్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం భోళా శంకర్. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తమిళ బ్లాక్ బాస్టర్ మూవీ వేదాలంకు రీమేక్ తెరకెక్కుతున్న ఈసినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు.చాలా గ్యాప్ తరువాత తను డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. ఈసినిమానుండి విడుదలైన మొదటి సాంగ్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇక కొద్దిసేపటి క్రితం ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈటీజర్ ను ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా కట్ చేశారు. టీజర్ లో చిరు లుక్ హైలైట్ అయ్యింది.చాలా యాక్టీవ్ గా కనిపించాడు. తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు చెప్పాడు.మొత్తానికి టీజర్ అయితే ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది.

సామజవరగమన ట్రైలర్ కోసం మెగాస్టార్
గత ఏడాది అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీ విష్ణు ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా సామజవరగమన. ఈసినిమా జూన్ 29వ తేదీన రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. రేపు అంటే జూన్ 25వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు ఈట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేస్తూ…

కంగనా ఎమర్జెన్సీ టీజర్ రిలీజ్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో, సినిమాలతో బాలీవుడ్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. ఈమధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఎక్కువ దృష్టి సారించింది కంగనా. ఝాన్సీ లక్ష్మీభాయి, తలైవి ఇలా పవర్ ఫుల్ పాత్రల్లో నటించింది కంగనా రనౌత్. ఇప్పుడు మరో పవర్ ఫుల్ లేడీ పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ రిలీజ్ కు సిద్దమవుతుంది. కంగనాా స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఎమర్జెన్సీ. అత్యంత శక్తివంతమైన మహిళా ప్రధానిగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ పాత్రలో ఈసినిమాలో నటిస్తుంది. ఎమర్జెన్సీ సమయంలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

డబ్బు కావాల్సినప్పుడల్లా తొలిప్రేమ రీరిలీజ్ చేసేవాడిని
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన స్టైల్ తో తన స్వాగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక పవర్ స్టార్ కు అంత క్రేజ్ రావడానికి కారణమైన సినిమా ఏదేంటే తొలిప్రేమ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతేకాదు ట్రెండ్ సెట్ సినిమా అని కూడా చెప్పొచ్చు. ఇక ఈసినిమాతోనే పవన్ కళ్యాణ్ రేంజ్ మారిపోయింది. సిన్సియర్ లవర్‌గా పవన్ యాక్టింగ్, మేనరిజమ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.

రాహుల్ రవీంద్రన్ నా బెస్ట్ ఫ్రెండ్ - సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్
టాలీవుడ్ సెలబ్రిటీలలో సమంత రూత్ ప్రభు ఒకరు. ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తన జీవితంలో జరిగే అన్ని విషయాలను ఆమె తరచుగా అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ నటుడు మరియు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గురించి చెప్పింది. రవి వర్మన్ దర్శకత్వం వహించిన 'మాస్కోయిన్ కావేరి' అనే తమిళ చిత్రంలో సమంత మరియు రాహుల్ కలిసి పనిచేశారు. అప్పటి నుండి వారు మంచి స్నేహితులు అయ్యారు. అలాగే రాహుల్ భార్య, నటి మరియు సింగర్ చిన్మయి శ్రీపాద సమంత నటించిన పలు చిత్రాలకు ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా వ్యవహరించారు. రాహుల్ చాలా మంచివాడని, దయగలవాడని…

గుంటూరు కారం షూటింగ్ షురూ
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం షూటింగ్ లాంగ్ బ్రేక్ తర్వాత మళ్ళీ ప్రారంభమైంది.ఇప్పటివరకు 20శాతం షూటింగ్ పూర్తి కాగా ఈరోజు నుండి మేజర్ బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకోనుంది.ప్రస్తుతం హైదరాబాద్ శివారులో వేసిన ఇంటి సెట్ లో షూటింగ్ జరుపుతున్నారు.ఇందులో మహేష్ బాబు తోపాటు రఘు బాబు,ఈశ్వరి లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.అక్టోబర్ లోగా సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.రీసెంట్ గా విడుదలైన టైటిల్ టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో పూజా హెగ్డే ,శ్రీలీల హీరోయిన్లు గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.