మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయిన కొద్దిరోజులకే చిరంజీవి ఈసినిమా షూటింగ్ లోో పాల్గొన్నాడు. అప్పటినుండీ ఎలాంటి బ్రేక్స్ తీసుకోకుండా ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటూ వెళ్లారు చిత్రబృందం. అందుకే ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక ఒకవైపు షూటింగ్ ను పూర్తి చేస్తూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి పలు అప్ డేట్లు ఇచ్చారు. అంతేకాదు టీజర్ కూడా రిలీజ్ చేసేశారు. టీజర్ అయితే సినిమాకు మరింత హైప్ ను తెచ్చిపెట్టింది. యాక్షన్ ప్యాక్డ్ గా ఉన్న టీజర్ లో చిరు లుక్ అలానే తన ఎనర్జిటిక్ యాక్టింగ్.. తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు అన్నీకూడా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా తన షూట్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చింది తమన్నా.. భోళా శంకర్ సెట్ లో లాస్ట్ డే అంటూ కీర్తి సురేష్ తను ఉన్న ఫొటోను పోస్ట్ చేసి.. క్యూటీ తో హ్యాంగిగ్స్ మిస్ అవుతా అంటూ పోస్ట్ లో పేర్కొంది.
కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈసినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: