పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఓజీ. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమా పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ ను ఈమధ్యనే ప్రారంభించారు. అయితే ఈసినిమా మాత్రం ఎక్కడా గ్యాప్స్ లేకుండా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. అలా షూటింగ్ మొదలుపెట్టారో లేదో అప్పుడే సగం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. తాజాగా ఈసినిమా షూటింగ్ అప్ డేట్ ను ఇచ్చింది చిత్రయూనిట్. యాక్షన్, ఎపిక్, డ్రామాతో కూడిన ఈసినిమా మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుందని.. తాజాగా మూడో షెడ్యూల్ పూర్తయిందని.. దీనితో ఈసినిమా 50శాతం షూటింగ్ ను పూర్తిచేసుకుందని చిత్రనిర్మాణ సంస్థ తెలిపింది. ఎగ్జైటింగ్ వీక్స్ ముందు ఉన్నాయని పోస్ట్ లో పేర్కొన్నారు. పవర్ స్టార్ లేకపోయినా కూడా మిగిలిన పోర్షన్స్ ను పూర్తి చేసేస్తున్నారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Action, Epicness & Drama…
A very productive three Schedules Done & Dusted. #OG Completes 50% of the shoot. Exciting weeks ahead 🤙🏻🔥#FireStormIsComing 🔥#TheyCallHimOG 💥 pic.twitter.com/x2wkRvLkgB— DVV Entertainment (@DVVMovies) June 26, 2023
కాగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో శ్రీయా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: