మొదటి సినిమా ‘మత్తు వదలరా’ లాంటి భిన్నమైన సినిమాను తీసి విమర్శకుల ప్రసంశలు సైతం దక్కించుకున్నాడు కీరవాణి తనయుడు శ్రీ సింహా. ఆ తరువాత తెల్లవారితే గురువారం, దొంగలుపడ్డారు జాగ్రత్త సినిమాలు చేశాడు. అవి సరైన విజయాన్ని అయితే అందించలేకపోయాయి. క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ఈమధ్య నుండే మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి రీసెంట్ గా వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే అనే వీడియోను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. జూన్ 26వ తేదీన మధ్యాహ్నాం 12గంటల 30 నిమిషాలకు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఇంకా ఈసినిమాలో జాన్ విజయ్, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, నందినీరాయ్, సుదర్శన్, వంశీ నెక్కంటి, వైవా హర్ష, కిడ్ చక్రి, జయవాణి, బాష, యాదం రాజు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పణలో వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ వారి అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: