ప్రాజెక్ట్ కే లోకి కమల్ హాసన్ 

kamal haasan play a key role in project k

మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కే.భారీ బడ్జెట్ తో  వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.వైజయంతి మూవీస్ నుండి వస్తున్న 50వ సినిమా కావడంతో చాలా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతుంది.కాస్టింగ్ విషయంలో మేకర్స్ ఎక్కడా తగ్గడం లేదు.ఇప్పటికే బాలీవుడ్ లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది.దిశా పటాని మరో కీలక పాత్రలో కనిపించనుంది.ఇక ఇప్పుడు మరో స్టార్ ఆడ్ అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు.ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా నిన్న అఫీషియల్ గా ప్రకటించారు.ఇప్పుడు కమల్ కూడా జాయిన్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఇదిలావుంటే కమల్ ను తీసుకోవడంపై అమితాబ్,ప్రభాస్,అశ్వినీ దత్
,నాగ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 

ఇక ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.ఈరోజు నుండి దీపికా పదుకొణె కూడా షూటింగ్ లో పాల్గొననుంది.వచ్చే నెలలో టీజర్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు.తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్
ఈసినిమాకోసం పనిచేస్తున్నారు.వచ్చే ఏడాది ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =