ఊరు పేరు భైరవకోన షూటింగ్ పూర్తి

sundeep kishans ooru peru bhairavakona movie shoot wrapped up

సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఇక ఈఏడాది మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్ ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా ఊరు పేరు భైరవ కోన. ఈ సినిమా మొత్తం గరుడపురాణం బ్యాక్ డ్రాప్ గా తీసుకొని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. గరుడపురాణంలో మిస్సయిన నాలుగు పేజీల్లో ఏముంది అనే సస్పెన్స్ తో ఈసినిమా వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈవిషయాన్నిసందీప్ కిషన్ తన ఇన్ట్సా ద్వారా తెలియచేశాడు. ఫైనల్లీ ఊరు పేరు భైరవకోన సినిమా షూటింగ్ పూర్తయింది.. సినిమా అంటే స్వచ్ఛమైన ప్రేమ ఉన్న బ్యూటీఫుల్ హార్ట్స్ తో రెండేళ్ల బ్యూటీఫుల్ జర్నీ అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Sundeep Kishan (@sundeepkishan)

కాగా సూప‌ర్ న్యాచురల్ ఫాంటసీ జోన‌ర్‌లో తెర‌కెక్కుతున్న ఈసినిమాలో సందీప్‌కు జోడీగా కావ్యా థాపర్‌, వర్ష బొల్లమ్మ నటిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్‌ బ్యానర్స్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 2 =