థ్రిల్లింగ్ గా సర్కిల్ మూవీ ట్రైలర్

neelakanta circle movie trailer out

నేషనల్ అవార్డ్ విన్నర్, డైరెక్టర్ నీలకంఠ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మిస్సమ్మ, సదా మీ సేవలో, విరోధి సినిమాలతో తెలుసు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఇక చాలా గ్యాప్ తరువాత నీలకంఠ తెలుగులో మరో సినిమాతో అలరించడానికి వచ్చేస్తున్నాడు. నీలకంఠ దర్శకత్వంలో సాయి రోనక్ హీరోగా సర్కిల్ సినిమా వస్తుంది. థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వస్తున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ తో అర్థమైపోయింది. ఒక ఫొటోగ్రాఫర్ జీవితం చుట్టూ తిరిగే కథ సర్కిల్. తన జీవితంలో శత్రువులెవరో, మిత్రులెవరో తెలియని సందిగ్ధంలో హీరో ఏం చేశాడనేది ఆసక్తికరంగా చూపించబోతున్నారు దర్శకుడు నీలకంఠ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా జులై 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ అయితే ఈసినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పర్ఫెక్ట్ సెట్ అయింది. మొత్తానికి ట్రైలర్ అయితే సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. మరి ఈసినిమా నీలకంఠకు మంచి కమ్ బ్యాక్ సినిమా అవుతుందేమో చూడాలి.

కాగా ఇంకా ఈసినిమాలో బాబా భాస్కర్, రిచా పనయ్, అర్షిన్ మెహతా, నైనా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్.వి శరత్ చంద్ర, టి సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ ఈసినిమాను నిర్మించారు. ఈసినిమాకు ఎన్‌ఎస్‌ ప్రసు సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 8 =