మెగా కాంపౌండ్ నుండి వచ్చిన యంగ్ హీరోలు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం ఎవరికి వారు తమ కెరీర్ లో దూసుకుపోతున్నారు. అంతేకాదు తమ సినిమాలతో ప్రతిఒక్కరు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వారిలో మెగా ప్రిన్స్ గా పేరుతెచ్చుకున్న నటుడు వరుణ్ తేజ్. మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు వరుణ్ తేజ్. అందుకే వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ఇక ఈఏడాది గనితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తరువాత ఎఫ్ 3 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం వరణ్ గాండీవధారి అర్జున అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈసినిమా కాకుండా అర్జున్ మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. వరుణ్ తేజ్ 13వ సినిమా ఇది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఇండియన్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ చిత్రంగా తెలుగు-హిందీ ద్విభాషల్లో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్‌ను IAF అధికారిగా కనిపించనున్నాడు. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభించగా మేకర్స్ నుండి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. దేశం ఇప్పటివరకు చూడని అతిపెద్ద, భయంకరమైన వైమానిక దాడులలో పోరాడిన మన హీరోల పోరాట స్ఫూర్తికి తగిన పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారు మేకర్స్. దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్టైనర్ తో కూడిన ఈ చిత్రం టైటిల్‌ను మేకర్స్ త్వలోనే అనౌన్స్ చేయనున్నారు.
కాగా ఈసినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: