టాలీవుడ్ సెలబ్రిటీలలో సమంత రూత్ ప్రభు ఒకరు. ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తన జీవితంలో జరిగే అన్ని విషయాలను ఆమె తరచుగా అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ నటుడు మరియు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గురించి చెప్పింది. రవి వర్మన్ దర్శకత్వం వహించిన ‘మాస్కోయిన్ కావేరి’ అనే తమిళ చిత్రంలో సమంత మరియు రాహుల్ కలిసి పనిచేశారు. అప్పటి నుండి వారు మంచి స్నేహితులు అయ్యారు. అలాగే రాహుల్ భార్య, నటి మరియు సింగర్ చిన్మయి శ్రీపాద సమంత నటించిన పలు చిత్రాలకు ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా వ్యవహరించారు. రాహుల్ చాలా మంచివాడని, దయగలవాడని తెలిపింది. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కష్టకాలంలో అతను అండగా ఉన్నాడని చెప్పింది. ఈ మేరకు సమంత తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలియజేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
కొన్ని రోజుల క్రితం, రాహుల్ తనకు పంపిన అందమైన సందేశాన్ని ఆమె పంచుకున్నారు. అందులో ఇలా ఉంది.. అందులో, “ఒక లోతైన శ్వాస తీసుకోండి పాపా. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, ఇది త్వరలో సక్రమంగా ఉంటుంది. మీరు ఈ 7-8 నెలల్లో చాలా దారుణమైన రోజులను చూశారు మరియు మీరు వాటిని అధిగమించారు. అది ఎప్పటికీ మర్చిపోవద్దు. మరియు మీరు వాటిని ఎలా అధిగమించారో గుర్తుంచుకోండి” అని ఉంది. కాగా సమంత మైయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న తన రాబోయే రొమాంటిక్ చిత్రం కుషి షూటింగ్లో బిజీగా ఉంది. అలాగే రాజ్, డీకే ద్వయం దర్శకత్వంలో వరుణ్ ధావన్‌తో కలిసి హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్లో కూడా పాల్గొంటోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























