మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం భోళా శంకర్. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తమిళ బ్లాక్ బాస్టర్ మూవీ వేదాలంకు రీమేక్ తెరకెక్కుతున్న ఈసినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు.చాలా గ్యాప్ తరువాత తను డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. ఈసినిమానుండి విడుదలైన మొదటి సాంగ్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇక కొద్దిసేపటి క్రితం ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈటీజర్ ను ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా కట్ చేశారు. టీజర్ లో చిరు లుక్ హైలైట్ అయ్యింది.చాలా యాక్టీవ్ గా కనిపించాడు. తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు చెప్పాడు.మొత్తానికి టీజర్ అయితే ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Presenting Mega🌟@KChiruTweets as #BholaaShankar in @MeherRamesh's Stylish Mass presentation😎#BholaaShankarTeaser out now🔥
– https://t.co/s4tjLXT3lc@AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanthA @SagarMahati @dudlyraj @sushkonidela @prakash3933 @Yugandhart_… pic.twitter.com/a6eB6qyZhT
— AK Entertainments (@AKentsOfficial) June 24, 2023
ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా చిరు కి చెల్లలిగా కీర్తి సురేష్ కనిపించనుంది.సుశాంత్,మురళీ శర్మ,రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు.ఈఆగస్టు 11న ఈసినిమా థియేటర్లలోకి రానుంది. చిరుకు ఈఏడాది లో ఇది రెండో రిలీజ్.ఈసంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.మరి భోళా శంకర్ తో మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: