సామజవరగమన ట్రైలర్ కోసం మెగాస్టార్

megastar will release samajavaragamana movie trailer

గత ఏడాది అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీ విష్ణు ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా సామజవరగమన. ఈసినిమా జూన్ 29వ తేదీన రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. రేపు అంటే జూన్ 25వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు ఈట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇంకా వెన్నెల కిశోర్‌, నరేశ్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్‌ బ్యానర్‌, హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.