యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా షూటింగ్ ఈమధ్య కాలంలోనే ప్రారంభమై ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా ఈసినిమా షూటింగ్ శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏరియాలో స్పెషల్ సెట్ లో జరుగుతుంది. రెండు వారాల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో కీలక యాక్షన్ సీక్వెన్స్ జరిగినట్టు తెలుస్తుంది. హాలీవుడ్ యాక్షన్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ జరిగినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఈమేరకు ఈసినిమా డీవోపీ అయిన రత్నవేలు తన ట్విట్టర్ ద్వాారా అప్ డేట్ ఇచ్చాడు. షూటింగ్ స్పాట్ లోని ఓ ఫోటోని షేర్ చేస్తూ.. ఎన్టీఆర్ తో నైట్ ఎఫెక్ట్‌లో, తక్కువ లైట్‌లో, వాటర్ లో కీలకమైన యాక్షన్ సీన్స్ చిత్రీకరణ పూర్తయింది అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
Filmed an interesting night effect action sequence in extreme low light n shade 🌊 with @tarak9999 brother 🔥 #Devara director #KoratalaSiva @anirudhofficial @NTRArtsOfficial @YuvasudhaArts @ARRIChannel #Arri Alexa LF #Arri Signature Primes pic.twitter.com/kYM7PPKwOU
— Rathnavelu ISC (@RathnaveluDop) June 25, 2023
కాగా ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. ఈసినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ను తీసుకున్నారు. విఎఫ్ఎక్స్ ను హాలీవుడ్ సినిమాలకి వర్క్ చేసిన బ్రాడ్ మిన్నిచ్ అందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: