బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో, సినిమాలతో బాలీవుడ్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. ఈమధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఎక్కువ దృష్టి సారించింది కంగనా. ఝాన్సీ లక్ష్మీభాయి, తలైవి ఇలా పవర్ ఫుల్ పాత్రల్లో నటించింది కంగనా రనౌత్. ఇప్పుడు మరో పవర్ ఫుల్ లేడీ పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ రిలీజ్ కు సిద్దమవుతుంది. కంగనాా స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఎమర్జెన్సీ. అత్యంత శక్తివంతమైన మహిళా ప్రధానిగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ పాత్రలో ఈసినిమాలో నటిస్తుంది. ఎమర్జెన్సీ సమయంలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాపై మొదటినుండి మంచి భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వడంతోో అచ్చం ఇందిరాగాంధీ లానే ఉంది అన్న ప్రశంసలు సైతం అందుకొని సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇప్పుడు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దేశంలో ఎమర్జెన్సీ విధించిన జూన్25, 1975 రోజుతో టీజర్ ప్రారంభమవుతుంది. ప్రతి పక్ష నేతల అరెస్ట్ లు, మీడియా ప్రసారాలు ఆగిపోవడం, ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేయడం..మరోవైపు పోలీసుల జులుం ఇవన్నీ చూపిస్తూ.. చివరిలో ఈజ్ ఇందిరా గాంధీ అంటూ టీజర్ ముగుస్తుంది. టీజర్ అయితే సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది అని చెప్పొచ్చు.
A protector or a Dictator? Witness the darkest phase of our history when the leader of our nation declared a war on it’s people.
🔗 https://t.co/oAs2nFWaRd#Emergency releasing worldwide on 24th November pic.twitter.com/ByDIfsQDM7
— Kangana Ranaut (@KanganaTeam) June 24, 2023
కాగా ఈసినిమాలో కంగనా నటిస్తూనే దర్శకత్వం వహిస్తుంది.. అలానే నిర్మాతగా కూడా తనే వ్యవహరిస్తుంది. మణికర్ణిక ఫిలింస్ బ్యానర్ పై కంగనా ఈసినిమాను నిర్మిస్తుంది. ఇంకా ఈసినిమాలో అనుపమ్ ఖేర్, శ్రేయ తల్పాడే, సతీష్ కౌషిక్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా నవంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































