పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన స్టైల్ తో తన స్వాగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక పవర్ స్టార్ కు అంత క్రేజ్ రావడానికి కారణమైన సినిమా ఏదేంటే తొలిప్రేమ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతేకాదు ట్రెండ్ సెట్ సినిమా అని కూడా చెప్పొచ్చు. ఇక ఈసినిమాతోనే పవన్ కళ్యాణ్ రేంజ్ మారిపోయింది. సిన్సియర్ లవర్‌గా పవన్ యాక్టింగ్, మేనరిజమ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈ క్లాసిక్ లవ్ స్టోరీ రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో జూన్ 30వ తేదీన మరోసారి ఈసినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. ఈసందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈనేపథ్యంలో నిర్మాత దిల్ రాజు పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. నా జీవితాన్ని ఒక పుస్తకంగా రాస్తే తొలిప్రేమకు ఖచ్చితంగా ఒక పేజీ ఉంటుంది.. పవన్ కళ్యాణ్ ఎవరో కొత్త కుర్రాడితో సినిమా చేస్తున్నాడని నాకు చెప్పడం జరిగింది దీంతో నేను పూజా కార్యక్రమానికి వెళ్లి కలిశా. అప్పుడు హైద్రాబాద్లో కలుద్దాం అన్నారు. అక్కడికి కూడా వెళ్లి ఒకే ఒక్క సిట్టింగ్ లో ఈసినిమాను ఓకే చేసుకున్నాం. ఇక ఈసినిమా జర్నీలో ఎంతో ఎంజాయ్ చేశా. నేను నా కెరీర్ లో ఎన్నో సినిమాలు తీశా కానీ నాకు తొలిప్రేమ స్పెషల్ మూవీ. ఈసినిమా 100 వ రోజు ఒక వైపు ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుంది.. అయినా కూడా ఈసినిమా చూడటానికి సంధ్య థియేటర్ కు ప్రేక్షకులు పెద్దఎత్తున వచ్చారు. దీంతో సంధ్య 70ఎమ్ఎమ్, సంధ్య 30 లో ఈసినిమాను రిలీజ్ చేశాం. అది ఒక చరిత్ర.. ఇంతవరకూ నేను ఎప్పుడూ అలాంటిది చూడలేదు. ఇక సినిమ రిలీజ్ తరువాత ఐదేళ్లకు సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఇచ్చేవారు. డబ్బులు ఎప్పుడు తక్కువుంటే అప్పుడు ఈసినిమా రీ రిలీజ్ చేసేవాడిని. ఈసినిమా నాకు ఎన్నో అడుగులు నేర్పించింది..నేను ఇలా ఉన్నానంటే దానికి తొలిప్రేమ కూడా ఒక కారణం.. ఈసినిమా రీరిలీజ్ కు అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేయండి.
కాగా తొలి ప్రేమ సినిమాలో ఇక పవన్‌కు జోడీగా కీర్తిరెడ్డి హీరోయిన్‌గా నటించింది. వాసుకి, అలీ, వేణు మాధవ్, నగేష్, నర్రా వెంకటేశ్వరరావు, రవిబాబు తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఎస్.ఎస్.వి ఆర్ట్స్ బ్యానర్‌పై జివిజి రాజు నిర్మించాడు. ఈ సినిమాకు దేవా సంగీతాన్ని అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: