
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 73


వార్ 2లో ఎన్టీఆర్ రోల్ రివీల్

ఖుషి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

బిజినెస్ మేన్ రీరిలీజ్ ట్రైలర్ రిలీజ్

ప్రభాస్ కల్కి షూటింగ్ అప్డేట్

చిరంజీవి గారితో కలిసి నటించడం నా అదృష్టం

కళ్యాణ్ రామ్ డెవిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

25 కోట్లపై సమంత కౌంటర్

గేమ్ ఛేంజర్ హైలెట్ గా 500 మంది ఫైటర్ల క్లైమాక్స్

వారితో నటించడంతో నా కల నెరవేరింది

మీ ప్రేమకు థ్యాంక్స్.. కానీ జాగ్రత్తగా ఉండండి

రవితేజ-గోపిచంద్ మలినేని మూవీ అప్డేట్

ఆకాశం దాటి వస్తావా టీజర్ రిలీజ్

ఖుషి ట్రైలర్ రెడీ

భగవంత్ కేసరి మేనియా కు సిద్దం

కోటి అడ్వాన్స్ బుకింగ్స్ తో బిజినెస్ మేన్ రికార్డ్
ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్ మేన్ సినిమా కూడా రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో 2012లో గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈసినిమాలో మహేష్ యాక్టింగ్ లోని మరో కోణాన్ని చూపించాడు పూరీ. అందుకే వన్ మ్యాన్ షో లాగ మహేష్ బాబు యాక్టింగ్, ఆయన యాటిట్యూడ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. అప్పట్లోనే ఈసినిమా 90 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టి నిర్మాతలకు లాభాలను అందించింది.

మహావీరుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి ఆ తరువాత హీరోగా మారి ఇప్పుడు మోస్ట్ టాలెంటెడ్ హీరోగా ఎదిగాడు శివ కార్తికేయన్. తన సినిమాలతో కేవలం తమిళ్ లోనే తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గానే మహావీరన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శివ కార్తికేయన్. తెలుగులో ఈసినిమా మహావీరుడు అనే టైటిల్ తో రిలీజ్ అయింది. ఈసినిమా జులై 14వ తేదీన ఈసినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా సూపర్ హిట్ ను అందుకుంది.

వార్ 2లో ఎన్టీఆర్ రోల్ రివీల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్,వార్ 2తో బాలీవుడ్ లోకి వెళ్లనున్నాడని తెలిసిందే.బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయనున్నాడు.స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది.త్వరలోనే అఫిషియల్ గా ఈసినిమా లాంచ్ కానుంది.ఈసినిమాలో ఎన్టీఆర్,హృతిక్ రోషన్ తో కలిసి నటించనున్నాడు.ఇక ఈసినిమాలో ఎన్టీఆర్ రోల్ ఎలా ఉండనుందో హింట్ ఇచ్చేసాడు అయాన్ ముఖర్జీ.తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అయాన్ ముఖర్జీ, వార్ 2 గురించి చెప్పుకొచ్చాడు.

ఖుషి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ఖుషి. క్రేజీ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకూ వచ్చిన అప్ డేట్లను బట్టి విజయ్ దేవరకొండ, సమంత మధ్య కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఈసినిమా అప్ డేట్స్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచేశారు మేకర్స్. ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ చేయగా మూడు పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నా రోజా నువ్వే పాట, ఆరాధ్య పాట, ఖుషి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయగా మూడు చార్ట్ బస్టర్ గా నిలిచాయి.

బిజినెస్ మేన్ రీరిలీజ్ ట్రైలర్ రిలీజ్
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూరీ రాసే సాలిడ్ డైలాగ్స్ ను మహేష్ బాబు ఇంటెన్స్ తో కూల్ గా చెప్తే ఆ డెప్త్ ఎలా ఉంటుందో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పోకిరి, బిజినెస్ మేన్ సినిమాలను చూస్తే అర్థమవుతుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అది అలా ఉంచితే బిజినెస్ మేన్ సినిమా మళ్లీ రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఆగష్ట్ 9వ తేదీన మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.

ప్రభాస్ కల్కి షూటింగ్ అప్డేట్
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నసైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఏడి.ఇటీవల విడుదలైన ఈసినిమా గ్లింప్స్ కు విశేషమైన స్పందన వచ్చింది.దాంతో సినిమాఫై అంచనాలను తార స్థాయికి చేరుకున్నాయి.ప్రస్తుతం షూటింగ్ స్టేజి లో ఉంది ఈసినిమా.ఇక నిన్నహైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.ప్రభాస్ ,హీరోయిన్ దీపికా పదుకోణ్ తదితరుల ఫై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈనెల 28వరకు ఈ షెడ్యూల్ జరుగనుంది.భారీ విఎఫ్ఎక్స్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్నఈసినిమాకి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకుడు.

చిరంజీవి గారితో కలిసి నటించడం నా అదృష్టం
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమాను కూడా ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. ఈసినిమా ఆగష్ట్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన పాటలు, టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఇటీవలే విడుదలైన ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

కళ్యాణ్ రామ్ డెవిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు తన రూట్ ను మార్చాడు. రొటీన్ కాన్సెప్ట్ లకు ఫుల్ స్టాప్ పెట్టి విభిన్నమైన సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈనేథ్యంలోనే గత ఏడాది బింబిసార లాంటి సినిమాను తీసి బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. ఇక ఈ ఏడాది అమిగోస్ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చాడు కళ్యాణ్ రామ్. అయితే ఈసినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది కానీ అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా డెవిల్. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను…

25 కోట్లపై సమంత కౌంటర్
ఎంత సైలెంట్ గా ఉన్నా కొంతమంది హీరోయిన్స్ పై ఏదో ఒక రూమర్ తెరపైకి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు సమంత పై కూడా అలాంటి ఒక రూమరే చక్కర్లు కొడుతుంది. మరి సమంత గురించి అందరికీ తెలిసిందే. ఏదైనా కౌంటర్ ఇవ్వడంలో కానీ.. తను అనుకున్నది ఎలాంటి మొహమాాటం లేకుండా ధైర్యంగా బయటకు చెప్పడంలో కానీ ఎక్పర్ట్. ఈనేపథ్యంలోనే తనపై వచ్చిన రూమర్ కు సాలిడ్ కౌంటర్ ఇచ్చింది.

భోళాశంకర్ నుండి రేజ్ ఆఫ్ భోళా రిలీజ్
వాల్తేరు వీరయ్య తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భోళాశంకర్.మరో 6రోజుల్లో థియేటర్లలోకి రానుంది.సాంగ్స్,ట్రైలర్ తో సూపర్ హైప్ తెచ్చుకున్న ఈసినిమా మరో 6రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఇక ఈసినిమా నుండి తాజాగా రేజ్ ఆఫ్ భోళా అనే సాంగ్ రిలీజ్ అయ్యింది.ఫాస్ట్ బీట్ తో వచ్చిన ఈసాంగ్ ఆకట్టుకుంది.డైరెక్టర్ మెహర్ రమేష్,ఫిరోజ్ ఇజ్రాయెల్ లిరిక్స్ అందించగా మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు.

గేమ్ ఛేంజర్ హైలెట్ గా 500 మంది ఫైటర్ల క్లైమాక్స్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే ఈమధ్య కాస్త గ్యాప్ రావడంతో షూట్ కు బ్రేక్ పడింది. రీసెంట్ గానే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఇక ఎలాంటి బ్రేక్ లు లేకుండా షూట్ ను పూర్తిచేయాలని మేకర్స్ పూర్తి చేయాలని చిత్రయూనిట్…
హత్య ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ్ హీరోల్లో విభిన్నమైన పాత్రలు చేసే హీరోల్లో చాలా మంది ఉన్నారు. వారిలో విజయ్ ఆంటోని పేరు కూడా ఉంటుంది. మొదటినుండీ కాస్త డిఫరెంట్ సినిమాలు చేయడానికే విజయ్ ఆంటోని ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. అందుకే విజయ్ ఆంటోని నుండి సినిమా వస్తుందంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. బిచ్చగాడు తరువాత తెలుగులో కూడా విజయ్ ఆంటోనికి మంచి ఫాలోయింగ్ పెరిగింది. రీసెంట్ గానే విజయ్ ఆంటోని హత్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది.

చంద్రముఖి 2 నుండి కంగనా ఫస్ట్ లుక్ రిలీజ్
పి.వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా చంద్రముఖి 2. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా వస్తుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇక రెండు రోజుల క్రితమే ఈసినిమా నుండి లారెన్స్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. రాయల్ లుక్ లో ఉన్న లారెన్స్ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. తాజాగా ఈసినిమాలో నటిస్తున్న కంగనా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అద్దంలో తనను తాను…

వారితో నటించడంతో నా కల నెరవేరింది
మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ తో హిట్ ను కొట్టగా.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భోళా శంకర్. వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమా మరో ఐదు రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే చిత్రయూనిట్ ఇచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో…

తంగలాన్- మాళవిక మోహనన్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్
విభిన్నమైన కథలు, సినిమాలు చేయడంలో విక్రమ్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పుడు మరో ప్రయోగాత్మకమైన సినిమాతో వచ్చేస్తున్నాడు. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. గతకొంతకాలంగా ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

మీ ప్రేమకు థ్యాంక్స్.. కానీ జాగ్రత్తగా ఉండండి
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన బ్రో సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. తమిళ్ లో వచ్చి సూపర్ హిట్ అయిన వినోదయ సితం అనే సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. పవన్ కళ్యాణ్ నటన, పవన్-తేజ్ ల కాంబినేషన్, మ్యూజిక్, డైలాగ్స్ అన్నీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా బాగా ఆకట్టుకోవడంతో మంది ఆదరణతో దూసుకుపోతుంది.

రవితేజ-గోపిచంద్ మలినేని మూవీ అప్డేట్
మాస్ మహారాజా రవితేజ,డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో నాలుగో సినిమా రానుందని తెలిసిందే.రీసెంట్ గా ఈసినిమా లాంఛ్ కూడా జరిగిపోయింది.వచ్చే నెల నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్నఈసినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.

ఆకాశం దాటి వస్తావా టీజర్ రిలీజ్
టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు పేరు ముందుంటుంది. ఇప్పటికే శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాలు చేస్తున్నాడు. ఈ బ్యానర్ కాకుండా దిల్ రాజు ప్రొడక్షన్స్ అంటూ మరో బ్యానర్ పెట్టి ఆ బ్యానర్ ద్వారా కొత్త టాలెంట్ ను ఎంకరేంజ్ చేసే విధంగా చిన్న సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈప్రొడక్షన్స్ నుండి వచ్చిన మొదటి సినిమా బలగం ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో చూశాం. వేణు దర్శకుడిగా ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈసినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. ఇక్కడ మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా ఈసినిమా ఇంపాక్ట్ ను క్రియేట్…

ఖుషి ట్రైలర్ రెడీ
లైగర్ తరువాత యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన సినిమా ఖుషి.శివ నిర్వాణ డైరెక్షన్ లో బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సమంత హీరోయిన్.షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.ఇప్పటి వరకు ఈసినిమా నుండి మూడు పాటలు విడుదలకాగా అన్ని చార్ట్ బాస్టర్ అయ్యాయి దాంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది.ఇక ఇప్పుడు ట్రైలర్ కూడా రానుంది.

భగవంత్ కేసరి మేనియా కు సిద్దం
ఈఏడాది వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు బాలకృష్ణ. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. రీసెంట్ గానే ఓభారీ సెట్ లో భారీస్థాయిలో ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు.