గత కొంతకాలంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాలకు సరైన బజ్ రాలేదు. దాంతో ఆ ప్రభావం ఓపెనింగ్స్ పడేది కానీ చాలా రోజుల తరువాత రజినీ మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తానేంటో నిరూపిస్తున్నాడు. రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్.ఈసినిమాకు కూడా నెల ముందు వరకు బజ్ నామమాత్రంగానే ఉండేది కానీ మొదటి సాంగ్ నువ్వు కావాలయ్యా రిలీజ్ అయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ఇక కొన్ని రోజుల ముందు రిలీజ్ అయిన ట్రైలర్ అయితే ఆ అంచనాలను రెట్టింపు చేసింది.దెబ్బకు భారీ హైప్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాంతో ఇప్పుడు తమిళనాడులో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్నాయి.మొదటి రోజు ఈసినిమా భారీ వసూళ్లను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. అటు యూఎస్ఏ లో కూడా అదే జోరును కొనసాగిస్తోంది.కేవలం ప్రీమియర్స్ తోనే 1మిలియన్ మార్క్ ను చేరుకునేలా వుంది.ఇటీవల కాలంలో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈరేంజ్ లో వసూళ్లను దక్కించుకున్న సినిమా కూడా ఇదే.అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసినిమా మంచి బజ్ ను క్రీయేట్ చేస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ బాగేనా వున్నాయి.హిట్ టాక్ వస్తే మాత్రం జైలర్ కొత్త రికార్డులను క్రియేట్ చేసేలానే వుంది.మొత్తానికి చాలా రోజుల తరువాత రజినీకాంత్, జైలర్ తో మళ్ళీ తన సత్తాచూపెడుతున్నాడు.
జైలర్ ను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయగా శివరాజ్ కుమార్ ,జాకీ ష్రాఫ్,రమ్యకృష్ణ,యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.సన్ పిక్చర్స్ నిర్మించింది.ఈనెల 10న జైలర్ తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదలవుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: