జైలర్ కోసం మిల్లర్ వెయిటింగ్

dhanush interesting post on jailer movie

తలైవా రజినీకాంత్ ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా జైలర్. ఈసినిమాను కూడా ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. అన్నాత్తే తరువాత చాలా లాంగ్ గ్యాప్ తో వస్తున్న సినిమా ఇది. దీంతో ఈసినిమా కోసం అభిమానులు కూడా ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఇక వారందరి ఎదురుచూపులకు ఇంకా మరికొద్ది గంటల్లో బ్రేక్ పడనుంది. ఇంకా ఒక్క రోజులో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కోసం అల్లుడు ధనుష్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఈనేపథ్యంలోనే తన సోషల్ మీడియా ద్వారా ఇది జైలర్ వీక్ అంటూ ట్వీట్ చేశాడు. ఇక ధనుష్ ట్వీట్ కు మేకర్స్ కూడా స్పందిస్తూ జైలర్ కోసం మిల్లర్ వెయిటింగ్ అంటూ రిప్లై ఇచ్చారు.

కాగా తమన్నా హీరోయిన్ గా నటించిన ఈసినిమాలో కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌, రమ్యకృష్ణ, ప్రియాంక అరుళ్‌మోహన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ కూడా తదితర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + fourteen =