జవాన్ నుండి షారుఖ్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్

interesting poster released out from jawan movie

పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్. ఇక ఇప్పుడు అదే జోష్ తో జవాన్ అనే సినిమాతో వచ్చేస్తున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ఈకాంబినేషన్ వల్ల సినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికితోడు పఠాన్ లాంటి హిట్ తరువాత షారుఖ్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే జవాన్ ప్రివ్యూ అంటూ వీడియోను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు రీసెంట్ గాన్ దుమ్ము దులిపేలా అంటూ ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేయగా.. మంచి బీట్ తో ఉన్న ఆ సాంగ్ ఆకట్టుకుంది. దీంతో ఈసినిమా కూడా ఖచ్చితంగా హిట్ కొడుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ను రిలీజ్ చేశారు మేకర్స్. జవాన్ రిలీజ్ కు ఇంకా నెల రోజులు ఉండటంతో ఈరోజు స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రివ్యూలో షారుఖ్ బాల్డ్ హెడ్ తో కనిపించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఆలుక్ ను అధికారికంగా రిలీజ్ చేశారు మేకర్స్. బాల్డ్ హెడ్ తో చేతిలో తుపాకీ పట్టుకొని ఉన్న షారుఖ్ లుక్ మాత్రం అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాగా ఈసినిమాలో షారుక్ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఒకటి ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తుండగా.. మరొకటి గ్యాంగ్‌స్టర్‌గా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ఈసినిమాలోనయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. విజయ్ సేతుపతి, ప్రియమణి, యోగి బాబు, సునీల్ గ్రోవర్ కూడా పలు పాత్రల్లో నటిస్తున్నారు. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై గౌరీఖాన్‌ నిర్మించనున్నారు. సెప్టెంబర్ 7 వ తేదీన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్‌ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =