శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం.. దానికి తోడు సెన్సిబుల్ లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో శివ నిర్వాణ ఎక్పర్ట్ కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్, పోస్టర్లు, పాటలు రిలీజ్ అవ్వగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ట్రైలర్ ను రేపు అంటే ఆగష్ట్ 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. హైద్రాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ ఈసినిమా 3 గంటల నుండి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా రేపు మహేష్ బ్లాక్ బస్టర్ హిట్ బిజినెస్ మేన్ సినిమా రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. మహేష్ పుట్టినరోజు సందర్భంగా బిజినెస్ మేన్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక సినిమాతో పాటు ఖుషి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అంతేకాదు రజినీకాంత్ సినిమా జైలర్ మూవీ ఆగష్ట్ 10వ తేదీన రిలీజ్ కాబోతున్న సంగతి కూడా విదితమే కదా. ఇక ఈసినిమా రిలీజ్ లో కూడా ఖుషి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
ఇంకా ఈసినిమాలో జయరామ్, సచిన్ ఖడేఖర్, అలి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: