ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 ది రూల్ షూటింగ్ మేజర్ బ్రేక్ లేకుండా రెగ్యులర్ గా కొనసాగుతుంది.ఇటీవల ఓ కీలకమైన షెడ్యూల్ ను పూర్తిచేయగా ఈరోజు మరో షెడ్యూల్ ప్రారంభమైంది.ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూటింగ్ జరుపుతున్నారు.ఈషెడ్యూల్ లో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందన్న కూడా జాయిన్ కానుంది.ఇది ఆమెకు రెండో షెడ్యూల్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంతకుముందు జూన్ లో చెన్నై లో జరిగిన షెడ్యూల్ లో నాలుగు రోజులు పాల్గొంది.మళ్ళీ ఇప్పుడు ఈకొత్త షెడ్యూల్ జాయిన్ అవుతుంది.ఈనెల 10నుండి ఆమె షూటింగ్ లో పాల్గొననుంది.15వ రోజులు ఈషెడ్యూల్ జరుగనుంది.ఈషెడ్యూల్ లో అల్లు అర్జున్,రష్మిక తదితరులఫై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.నవంబర్ లో గా షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలచేయాలని మేకర్స్ భావిస్తున్నారు.సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
ఇక బ్లాక్ బాస్టర్ పుష్పకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2ది రూల్ ఫై తెలుగులోనే కాదు హిందీలోనూ భారీ అంచనాలు వున్నాయి.మరి ఈసినిమా ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: