ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ కానున్న సలార్ 

Salaar imax Release confirmed

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ వచ్చే నెలలో విడుదలకానుంది.ఇటీవల విడుదలైన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా ఐమాక్స్ వెర్షన్ లో కూడా విడుదలకానుందట.ఇంతకుముందు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ని కూడా ఐమాక్స్ వెర్షన్ లో విడుదలచేయాలనుకున్నారు కానీ కుదరలేదు అయితే సలార్ మాత్రం ఐమాక్స్ వెర్షన్ లో రిలీజ్ కానుందట.తెలుగులో మొదటి సారిగా ఐమ్యాక్స్ వెర్షన్ లో విడుదలైయిన సినిమా బాహుబలి 2.దాంతో ఇప్పుడు సలార్ రెండో సినిమా కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కెజియఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ పాత్రను పోషిస్తున్నాడు.రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది.ఈసినిమాఫై భారీ అంచనాలు వున్నాయి.పాన్ ఇండియా మూవీ గా సెప్టెంబర్ 28న సలార్ ఫస్ట్ పార్ట్ థియేటర్లలోకి రానుంది.

ఇక ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడి షూటింగ్ లో బిజీగా వున్నాడు.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తుంది.అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.వైజయంతి మూవీస్ బ్యానర్ ఫై అశ్వినీ దత్ నిర్మిస్తున్నాడు.వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − five =