మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా సినిమాకు ఏదో ఒక వైవిధ్యం ఉండేలా చూసుకుంటాడు. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. అభిలాష్ జోషి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా కింగ్ ఆప్ కోత. గ్యాంగ్స్టర్ డ్రామాగా 80, 90 కాలం బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే రీసెంట్ గా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ట్రైల్ర రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఆగష్ట్ 9వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారింకగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో ఇంకా ప్రసన్న, నైలా ఉషా, చెంబన్ వినోద్, గోకుల్ సురేశ్, షమ్మీ తిలకన్, శాంతి కృష్ణ, వడా చెన్నై శరన్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వేఫరెర్ ఫిలిమ్స్-జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. షాన్ రెహ్మాన్, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా..నిమిష్ రవి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈసినిమా పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: