సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం నుండి పోస్టర్ రిలీజ్ అయ్యింది.ఈరోజు మహేష్ బాబు బర్త్ డే కావడంతో ఈ సందర్భంగా సినిమా నుండి ఆయన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఇక ఈ పోస్టర్ లో మహేష్ లుంగీ కట్టుకొని బీడీ తాగుతూ మాస్ లుక్ లో కనిపించాడు.ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం కాగా ఇప్పటివరకు 30 శాతం పూర్తి అయ్యింది. త్వరలోనే మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Wishing a spectacular Happy Birthday to the Reigning Superstar, @urstrulymahesh garu! 🤩#HBDSuperstarMaheshBabu ✨
Your unparalleled on-screen brilliance coupled with your genuine off-screen humility continues to set a remarkable standard of inspiration 🌟🎉… pic.twitter.com/INkV4ZtJK4
— Haarika & Hassine Creations (@haarikahassine) August 8, 2023
పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో శ్రీ లీల,మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటిస్తున్నారు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.
ఇక మహేష్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజైన బిజినెస్ మేన్ థియేటర్లలో దుమ్మురేపుతుంది.రీ రిలీజ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా బిజినెస్ మేన్ రికార్డు సృష్టించనుంది.పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో మహేష్ కు జంటగా కాజల్ నటించగా తమన్ సంగీతం అందించాడు.ఆర్ఆర్ మూవీ మేకర్స్ నిర్మించింది. 2012లో విడుదలైన ఈసినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: