NC23 ఫుల్ కసరత్తులో ప్రీ ప్రొడక్షన్ పనులు

naga chaitanya 23 movie pre production work update

రీసెంట్ గానే కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ హీరో నాగ చైతన్య. ఈసినిమా సరైన విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. యదార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే అర్థమైంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. మరి రియల్ ఇన్సిడెంట్ తో ఈసినిమాను తీస్తున్నారు కాబట్టి.. రియల్ ఇన్సిడెంట్స్ తో సినిమా అంటే కచ్చితంగా హోం వర్క్, రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలోనే ఇప్పటికే నాగచైతన్య, చందూ మొండేటి, బన్నీవాసు ఆ పనిలో పడ్డారు. దీనిలో భాగంగానే కె.మత్స్యలేశం గ్రామానికి వెళ్లి అక్కడి మత్స్యకారుల కుటుంబాలను కలిశారు. ఇక దీనిని ది ఫస్ట్ కట్ డాక్యుమెంటేషన్ అనే డాక్యుమెంటరీ అంటూ వీడియోను రిలీజ్ చేసారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కూర్చొని ఈ కథను సిద్దం చేయడం సరి కాదని డైరెక్టర్ చందూ భావించాడు.. అందుకే నేరుగా ఇక్కడికి వచ్చి ఇక్కడి ప్రజలు, వాతావరణాన్ని అధ్యయనం చేస్తూ చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రీ ప్రొడక్షన్‌ను ముందుకు తీసుకెళ్తున్నాం అన్నారు

చందూ మొండేటి మాట్లాడుతూ.. ఈ గ్రామానికి వచ్చి ప్రతి అంశానికి సంబంధించిన వివరాలను పరిశీలించిన తర్వాత మా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ స్టార్ట్ అయ్యింది.

హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. పాత్రలన్నిటిని కలసి వారి బాడీ లాంగ్వేజ్‌, పల్లె పరిస్థితులు, వారి జీవనశైలిని అర్ధం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చామని తెలిపాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.