మెగా కాంపౌండ్ నుండి వచ్చీ కూడా తన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందించారు మేకర్స్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈనేపథ్యంలోనే వరుణ్ తేజ్ డబ్బింగ్ పనులను కూడా మొదలుపెట్టేశాడు. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ప్రీ టీజర్, టీజర్, నీజతై పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రీ టీజర్ లో టీజర్ లో హాలీవుడ్ రేంజ్ లో ఉన్న విజువల్స్ యాక్షన్ సీక్వెన్స్ తో సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ట్రైలర్ ను కూడా త్వరలో రిలీజ్ చేస్తున్నట్టు చిత్రయూనిట్ ఇప్పటికే తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇక చెప్పినట్టే తాజాాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఆగష్ట్ 10వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. హైద్రాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ లో సాయంత్రం 3 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నాారు. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. బిగ్ ఫైట్, మిడ్ నైట్ యాక్షన్స్ అంటూ షూటింగ్‌లోని కొన్ని సీన్స్ ను వీడియోలో చూపించారు.
Strap in, it’s about to get awesome!!!#GandeevadhariArjuna
Trailer releasing on AUGUST 10th ,
event at Prasad imax @ 3pm!🔥@sakshivaidya99 @PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial @shreyasgroup #GDAonAugust25th pic.twitter.com/zDLFELtSVK
— Varun Tej Konidela (@IAmVarunTej) August 8, 2023
కాగా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: