సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. విరూపాక్ష, బ్రో సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాడు. అయితే బ్రో ప్రమోషన్స్ సమయంలో సాయి ధరమ్ తేజ్ తన తరువాత సినిమాకు గ్యాప్ తీసుకుంటున్నానని తెలిపాడు. ఇక ఇప్పుడు సత్య అంటూ వచ్చేస్తున్నాడు. నేడు దానికి సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నవీన్ కృష్ణ దర్శకత్వంలో సాయి తేజ్ ప్రధాన పాత్రలో ఒక మ్యూజిక్ వీడియో రాబోతుంది. నవీన్ కృష్ణ ఎవరో కాదు సీనియర్ నటుడు నరేష్ తనయుడే నవీన్ కృష్ణ. తను కూడా పలు సినిమాల్లో నటించాడు. ఇక ఇప్పుడు దర్శకుడిగా మారుతున్నాడు. నిజానికి జనవరిలో ఈమ్యూజిక్ వీడియోకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఆతరువాత పరిస్థితుల వల్ల ఈ వీడియో ఆలస్యమైంది. ఇక ఇప్పుడు సాంగ్ టీజర్ అప్ డేట్ తో వచ్చారు. సాంగ్ టీజర్ ను రేపు అంటే ఆగష్ట్ 8వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. తెలుగు, తమిళ్ ఇంకా హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ వీడియోలో కలర్స్ స్వాతి కూడా నటిస్తుంది. దిల్ రాజ్ ప్రోడక్షన్స్ బ్యానర్ పై ఈ మ్యూజిక్ వీడియోను నిర్మిస్తున్నారు.
“Amidst life’s storms, she released her dove, a tribute to bravery and devotion, an anthem of sacrifice and love.”
Coming soon to you ‘#TheSoulOfSatya‘ ft. @IamSaiDharamTej and #SwathiReddy from ‘#Satya‘ 🙏🏻😊@NawinVK @DilRajuProdctns @HR_3555 #HanshithaReddy pic.twitter.com/UEDMXxU9Pc
— Dil Raju Productions (@DilRajuProdctns) August 7, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: