ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు. గని సినిమాతో ఫ్లాప్ ను మూటగట్టుకున్న వరుణ్ ఈసినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ను చూస్తుంటే వరుణ్ హిట్ కొట్టేలానే చూస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. వరుణ్ తేజ్ ఈసినిమా డబ్బింగ్ ను మొదలుపెట్టినట్టు తెలిపారు. అంతేకాదు ట్రైలర్ అనౌన్స్ మెంట్ ను కూడా త్వరలో ఇవ్వనున్నట్టు తెలిపారు మేకర్స్.
Mega Prince @IamVarunTej aka ARJUN VARMA begins his dubbing for #GandeevadhariArjuna 🎙️🔥
TRAILER ANNOUNCEMENT SOON💥
In Cinemas WW from AUGUST 25th❤️🔥@sakshivaidya99 @PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial @JungleeMusicSTH #GDAonAugust25th pic.twitter.com/czlvAW9UU3
— SVCC (@SVCCofficial) August 6, 2023
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: