పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ గ్లింప్స్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది.ఈరోజు పవన్ బర్త్ డే సందర్భంగా ఈటీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.100 సెకండ్ల రన్ టైంతో వచ్చిన ఈ గ్లింప్స్ హైప్ కు ఏమాత్రం తగ్గకుండా వుంది.గ్లింప్స్ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ గా పవన్ రూత్ లెస్ గ్యాంగ్ స్టర్ గా కనిపించాడు.గ్లింప్స్ లో పవన్ లుక్,తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యింది.పవన్ ను ఇంతకుముందు ఎప్పుడూ చూపించని విధంగా చూపిస్తున్నాడు డైరెక్టర్ సుజీత్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓజీ సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్,శ్రీయ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు.డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈసినిమా వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో విడుదలకానుంది.
ఇక పవన్ బర్త్ డే సందర్బంగా ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఈరోజు సాయంత్రం 6:03 గంటలకు అప్డేట్ రానుంది.హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈసినిమా కూడా వచ్చే ఏడాదే థియేటర్లలోకి రానుంది.
ఇక పవన్ ఈసినిమా లతో పాటు ప్రస్తుతం హరి హరవీరమల్లు లోకుడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ మాత్రం ఆలస్యంగా జరుగుతుంది.పవన్ బర్త్ డే సందర్భంగా నిన్న ఈసినిమా నుండి పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేశారు.ఈపోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ ఫై భారీ బడ్జెట్ తో ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమా కూడా వచ్చే ఏడాదే థియేటర్లలోకి రానుంది.
Celebrating the extraordinary bravery, grace, and boundless compassion of our #HariHaraVeeraMallu, @pawankalyan garu, on this exhilarating day! 🎉🔥 #HBDJanaSenaniPawanKalyan 🎂💫 @DirKrish @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @gnanashekarvs… pic.twitter.com/t3T8TQr3Ts
— Mega Surya Production (@MegaSuryaProd) September 1, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























