ఆ పాత్ర పోషించాలంటే.. జూ.ఎన్టీఆర్‌కే సాధ్యం – బాలీవుడ్‌ డైరెక్టర్

Jr NTR Can Play That Iconic Character, Says Gadar 2 Director Anil Sharma

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌పై బాలీవుడ్‌ దర్శకుడు ప్రశంసల వర్షం కురిపించారు. బాలీవుడ్‌ సీనియర్ నటుడు సన్నీడియోల్‌ హీరోగా ఇటీవలే విడుదలైన ‘గదర్‌ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు అనిల్‌ శర్మ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను ఆకాశానికెత్తేసాడు. ఈ సినిమాలోని తారాసింగ్‌ (కథానాయకుడు) పాత్రకు సన్నీడియోల్ కాకుండా.. ఏ ఆర్టిస్ట్‌ అయితే సరిగ్గా సరిపోతారనే ప్రశ్నకు డైరెక్టర్ అనిల్‌ శర్మ ఆసక్తికర సమాధానం చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనిల్‌ శర్మ ఏమన్నారో అయన మాటల్లోనే.. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ‘గదర్‌’ చిత్రం చేయాలంటే తారాసింగ్‌ పాత్రకు సరిపోయే వారు ఎవరూ ఈ జెనరేషన్ నటులలో నాకు కనిపించడం లేదు. బాలీవుడ్‌లో ఎవరూ లేరు, కానీ.. సౌత్ హీరోలలో కొందరు ఉన్నారు. వారిలో కూడా ముఖ్యంగా జూ.ఎన్టీఆర్‌ అయితే ఈ పాత్రకు న్యాయం చేయగలడని నా నమ్మకం. ఎన్టీఆర్‌ తారాసింగ్‌ పాత్రకు సరిగ్గా సరితూగుతారు, అలాగే ఆ ఐకానిక్ క్యారెక్టర్‌ని ఆయన అద్భుతంగా పోషించగలరు” అని పేర్కొన్నారు. ఇక అనిల్ శర్మ లాంటి డైరెక్టర్ నుండి తారక్ ఇలాంటి ప్రశంసను అందుకోవడంపై ఆయన ఫ్యాన్స్ సహా ఇండస్ట్రీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

కాగా అనిల్‌ శర్మ దర్శకత్వంలో 22 ఏళ్ల క్రితం 2001లో విడుదలయిన ‘గదర్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ’.. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసే ఉంటుంది. తాజాగా ఆయన దీనికి సీక్వెల్‌గా మరోసారి మెగాఫోన్ చేతపట్టి రూపొందించిన చిత్రం ‘గదర్ 2’. అయితే సీక్వెల్‌ కూడా బాలీవుడ్ సినీ విశ్లేషకుల అంచనాలను తల్లకిందులు చేస్తూ ఇప్పటివరకూ రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఇటీవలే కొత్తగా కట్టిన భారత పార్లమెంట్ భవనంలో ఎంపీల కోసం దీనిని ప్రత్యేకంగా ప్రదర్శించడం విశేషం. రోజుకి 5 షోల చొప్పున మొత్తం మూడు రోజులు ఈ సినిమాను పార్లమెంట్ లో ప్రదర్శించారు. ఇలా పార్లమెంట్ లో ఒక సినిమాను ప్రదర్శించడం ఇప్పటివరకు దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు, ఇదే ప్రథమం. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్‌ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే దీని తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌తో కలసి ‘వార్‌ 2’ అనే హిందీ చిత్రం చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =